
రామప్పలో పకడ్బందీ ఏర్పాట్లు
ములుగు/వెంకటాపురం(ఎం): మిస్ వరల్డ్–2025 పోటీలలో పాల్గొడానికి వచ్చిన సుందరీమణు రాక సందర్భంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయ పరిసరాల్లో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా పోలీస్ శాఖ తరఫున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర సూచించారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఎస్పీ డాక్టర్ శబరీశ్‌తో కలిసి ఈ నెల 14వ తేదీ సుమారు 35 మంది సుందరీమణులు హైదరాబాద్ నుంచి తెలంగాణ జరూర్ ఆనా అనే టైటిల్‌తో రూపొందించిన ఏసీ బస్సులో నేరుగా రామప్పకు చేరుకుంటారని తెలిపారు. రామప్పను సందర్శించే సమయంలో ఎక్కడా ఏ చిన్న సమస్య ఉత్పన్నం కాకుండా చూడాల్సిన బాధ్యత అన్ని శాఖల అధికారులపై ఉందన్నారు. రామప్పలోని ఏర్పాట్లు అబ్బురపరిచేలా చూడాలన్నారు. రామప్ప జ్ఞాపకాలు మరిచిపోకుండా ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు సీహెచ్.మహేందర్‌జీ, సంపత్‌రావు తదితరులు పాల్గొన్నారు.
వెయ్యి మందితో బందోబస్తు
రామప్పకు ప్రపంచ సుందరీమణులు రానున్న నేపథ్యంలో వెయ్యిమంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. జిల్లా ప్రవేశంలో ఉన్న మహ్మద్‌గౌస్‌పల్లి నుంచి రామప్ప ఆలయం, రామప్ప కట్ట, హరిత హోటల్ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా నిర్వహించనున్నారు. సుమారు 35 మంది సుందరీమణులు ప్రత్యేక ఏసీ బస్సులో రామప్పకు రానున్నారు. వీరికి ఎక్కడా ఇబ్బందులు కలగకుండా పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటారని తెలిపారు. బందోబస్తులో ఎస్పీ పర్యవేక్షణలో అడిషనల్ ఎస్పీ, ఏఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, 14 మంది డీఎస్పీలు, 43 మంది ఎస్సైలు, 127 మంది ఏఎస్‌ఐ, హోంగార్డులు 360 మంది కానిస్టేబుళ్లు, 54 మంది హోంగార్డులు, 113 మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్లు, 125 మంది స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్లు విధులు నిర్వహించనున్నారు.సుందరీమణులు అంతా యువతులే కావడంతో వారి చుట్టూ వలయంలా ఉండి భద్రత చర్యలు చేపట్టేందుకు 160 మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత లోనికి ఎవరికీ అనుమతి ఉండదు. ఈ మేరకు సోమవారం సిబ్బందికి విధులు కేటాయించిన అనంతరం ఎస్పీ శబరీశ్ రామప్ప ఆలయం, హరిత్ హోటల్, చెరువు కట్ట ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు.
వెయ్యి మందితో భారీ బందోబస్తు
కలెక్టర్ టీఎస్.దివాకర
లేజర్ షోకు ఏర్పాట్లు
మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ రామప్ప ఆలయాన్ని సందర్శించిన అనంతరం రామప్ప గార్డెన్‌లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు లేజర్‌షో ను నిర్వహించనున్నట్లు సమాచారం. సుమా రు 15 నిమిషాల పాటు సౌండ్ లైటింగ్ షో ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిసింది. అందుకోసం సోమవారం రాత్రి 9:45 గంటలకు లేజర్‌షోకు సంబంధించి ఏర్పాట్లు, లైటింగ్‌ను నిర్వాహకులు పరిశీలించారు.

రామప్పలో పకడ్బందీ ఏర్పాట్లు

రామప్పలో పకడ్బందీ ఏర్పాట్లు