
గిరిజన దర్బార్‌కు వచ్చిన వినతుల వివరాలు..
ఏటూరునాగారం మండలం ఆకులవారిఘణపురం గ్రామానికి చెందిన గిరిజనులు ఉపాధి కల్పించాలని విన్నవించారు. బ్యాంకు సబ్సిడీ ఇవ్వాలని పలువురు అర్జి పెట్టుకున్నారు. అలాగే పలువురు గిరిజనులు సబ్సిడీ రుణం మంజూరు చేయాలని కోరారు. ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో సమ్మక్క–సారలమ్మ ప్రాంతంలో రంగులు వేసిన పెయింటింగ్ జీఎస్టీ బిల్లులు ఇప్పించాలని సదరు కాంట్రాక్టర్ పీఓను కోరారు. మంగపేట మండలం తొండ్యాల లక్ష్మీపురం ప్రాంతంలో ఎంఎస్‌ఏఈ పెయింటింగ్ యూనిట్ మంజూరు చేయాలని గిరిజనులు పీఓకు విన్నవించారు. కన్నాయిగూడెం మండల పరిధిలోని తహసీల్దార్ కార్యాలయం పక్కనే బహుళ అంతస్తులు కడుతున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే దానిని తొలగించాలని గిరిజనులు విన్నవించారు. మహబూబాబాద్, వరంగల్ జిల్లా నుంచి ఏజెన్సీ సర్టిఫికెట్లపై డీఎల్‌ఎస్‌సీ నిర్వహించి జెన్యూనిటీ ఇప్పించాలని కోరారు. జనగామ జిల్లాలో 2017–18లో సీఆర్‌టీలుగా పనిచేసిన వేతనాలు ఇప్పించాలని సీఆర్‌టీలు విన్నవించారు. సాగులో ఉన్న పోడు భూములకు బోర్లు వేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు చిరంజీవి, దామోదర్ కోరారు. సెంట్రల్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్స్ ప్రారంభించాలని ఎస్‌ఎఫ్‌ఐ, గిరిజన సంఘం నాయకులు కోరారు. కార్యక్రమంలో డీడీ పోచం, మేనేజర్ శ్రీనివాస్, ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.