
రేపటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ
ములుగు: రేపటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం అవుతుందని డీఈఓ పాణిని తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ ఆదివారం శిక్షణ వివరాలను వెల్లడించారు. జిల్లాలో ఇప్పటికే శిక్షణకు అన్ని ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. వివిధ సబ్జెక్టులకు కేటాయించిన షెడ్యూల్‌ను అనుసరించి శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆయా తేదీల్లో సదరు ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. 13వ తేదీ నుంచి స్కూల్ అసిస్టెంట్ గణితం, సోషల్, ప్రాథమిక పాఠశాల ఎమ్మార్పీలకు, తెలంగాణ మోడల్ స్కూల్ చల్వాయి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్, స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చల్వాయిలో ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. శిక్షణకు హాజరయ్యే వారికి భోజన సౌకర్యం కల్పించడంతో పాటు ప్రతిరోజూ అటెండెన్స్ ఉంటుందని తెలిపారు. స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ద్వారా ఇన్, అవుట్ టైమ్ నమోదు చేస్తామని వివరించారు. 13 నుంచి 17 వరకు శిక్షణ పొందిన ఎమ్మార్పీలు 20 నుంచి 24 వరకు ఆయా మండలాల్లోని మిగతా ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. మిగితా సబ్జెక్టులైన తెలుగు, హిందీ, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రంలపై గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు ఈ నెల 26 నుంచి 30 వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు.
డీఈఓ పాణిని