
ఉగ్రవాద స్థావరాలపై దాడి భారత ఆర్మీ ఘనత
ములుగు రూరల్: పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై దాడిచేసి ఉగ్రవాదులను మట్టుపెట్టిన ఘనత భారతదేశ ఆర్మీదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై మూడు రంగుల జెండాలతో బుధవారం ర్యాలీ నిర్వహించి టపాసులు పేల్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కశ్మీర్‌లోని పహల్గాం దాడికి ప్రతీ దాడిగా ఇండియన్ ఆర్మీ సిందూర్ పేరున ఉగ్రవాదులపై దాడి చేశారని తెలిపారు. కశ్మీర్ అక్రమిత ప్రాంతంలో 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి 100 మంది ఉగ్రవాదులను అంతం చేశారని తెలిపారు. భారత త్రివిధ దళాల సమన్వయంతో ఉగ్రవాద స్థావరాలపై దాడిలో భారత ఆర్మీ విజయం సాధించిందని వివరించారు. అక్రమంగా దేశంలో ఉంటున్న పాకిస్తానీయులు వెంటనే దేశం వదిలి వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతలపూడి భాస్కర్‌రెడ్డి, గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, కృష్ణాకర్, ఇమ్మడి రాకేశ్‌యాదవ్, నగరపు రమేష్, వాసుదేవరెడ్డి, కుమార్, శ్రీనివాస్, రవీందర్, హేమాద్రి, పాపిరెడ్డి, శ్రీహరి, ప్రవీణ్, సతీష్, రాజేందర్, నాగరాజు, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం