
సమ్మె నోటీస్ అందజేత
ములుగు రూరల్: ఈ నెల 20వ తేదీన దేశ వ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెలో ములుగు జిల్లా కార్మికులు పాల్గొంటున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ అన్నారు. ఈ మేరకు బుధవారం సివిల్ సప్లయీస్ డీఎం రాంపతికి కార్మికులతో కలిసి సమ్మె నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 44కార్మిక చట్టాలను తొలగించి 4లేబర్ కోడ్‌లను అమలు చేయడం వల్ల కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. సుప్రీంకోర్టు కనీస వేతనం చెల్లించాలని ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం ధిక్కరిస్తుందన్నారు. ఈ మేరకు చేపట్టిన సమ్మెలో హమాలీ, భవన నిర్మాణ, వంట కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హమాలీ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మొలుగూరి రాంబాబు, రొంటాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.