
అభిషేకం చేస్తున్న భక్తులు
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం దుర్గాదేవి పంచలోహ ఉత్సవ విగ్రహానికి భక్తులు, అర్చకులు యల్లప్రగడ నాగేశ్వర్‌రావుశర్మ, మణికంఠశర్మలు ప్రత్యేక పంచామృత అభిషేక పూజలను నిర్వహించారు. పలువురు దాతలు నూతనంగా దుర్గాదేవి ఉత్సవ విగ్రహాన్ని రామాలయానికి బహుకరించారు. ఈ మేరకు విగ్రహాన్ని మండల కేంద్రంలోని హనుమాన్ గుడి నుంచి రామాలయం వరకు అమ్మవారి పాటలకు మహిళలు కోలాటం నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా సాగారు. బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేసి చీరె సారలను, నైవేధ్యాలను సమర్పించారు. రామాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మోడెం రమేష్, గాడిచర్ల సాంబయ్య, బాల్య ప్రసాద్, మండల రామకృష్ణ, అలువాల శ్రీనివాస్, పెండ్యాల సంతోష్, గడ్డం వినయ్, రాకేష్, ఎక్కడి వెంకటేశ్వర్లు, కొండగొర్ల వెంకన్న, బాలాజీ, మాదరి మధు, గడదాసు శివ, శశి, కత్తెర శీను, భక్తులు పాల్గొన్నారు.