
ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే సీతక్క
ఏటూరునాగారం: రంజాన్ ఒక పవిత్రమైన పండుగ అని, మానవ సేవ చేయాలన్న సందేశాన్ని మానవాళికి అందించే పండుగ అని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మండలకేంద్రంలోని జామా మసీద్‌లో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంజాన్ మాసంలో ఆచరించే ప్రార్థనలు, ఉపవాసం క్రమశిక్షణను, ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు పైడాకుల అశోక్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ అయూబ్ ఖాన్, మండల అధ్యక్షుడు చిటమట రఘు, ఎండీ అఫ్సర్ పాషా, ఎండీ చాంద్ పాషా, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు ఆకుతోట చంద్రమౌళి, జిల్లా నాయకుడు ఖలీల్ ఖాన్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ.గౌస్, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య, పట్టణ అధ్యక్షుడు సులేమాన్, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు శ్రీను, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు లక్కీ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సీతక్క