
మాట్లాడుతున్న డివిజనల్ మేనేజర్ ప్రతాప్‌రెడ్డి
ములుగు రూరల్: అటవీ ఉత్పత్తుల కొనుగోలు చేసి పరిశ్రమ ఏర్పాటుకు తోడ్పాటును అందించాలని జీసీసీ డివిజనల్ మేనేజర్ ప్రతాప్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఇంచర్లలో బుధవారం నిర్వహించిన గిరిజన ప్రాథమిక సహకార సంఘం 9వ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముందుగా జీసీసీ ములుగు బ్రాంచ్ చేపట్టిన కార్యక్రమాలు, ఆదాయ వివరాలను తెలుసుకుని మాట్లాడారు. జిల్లాలోని ప్రతీ మండలంలో జీసీసీ పెట్రోల్ బంక్‌ల ఏర్పాటుకు తహసీల్దార్లు స్థల సేకరణ చేస్తున్నారన్నారు. జాకారం లోని పెట్రోల్ బంక్ పనులు ఏప్రిల్ చివరి వారం వరకు పూర్తి చేస్తామన్నారు. గిరిజనులు అటవీ ఉత్పత్తుల్లో విప్ప పువ్వు, విప్ప గింజల సేకరణ చేపట్టాలన్నారు. దీంతో ఐటీడీఏ ఆధ్వర్యంలో విప్పనూనె కర్మాగారం ఏర్పాటుకు వీలుంటుందని వివరించారు. అనంతరం నూతనంగా ఎన్నికై న సొసైటీ డైరెక్టర్లను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జీసీసీ మేనేజర్ శ్రీనివాస్, యాకయ్య, పుల్లయ్య, వరలక్ష్మీ పాల్గొన్నారు.