
మాట్లాడుతున్న భాస్కర్‌రెడ్డి
ములుగు రూరల్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శించే అర్హత మంత్రి కేటీఆర్‌కు లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. దేశం కోసం అనునిత్యం పని చేస్తున్న ప్రధానిని విమర్శించే ముందు కేటీఆర్ స్థాయి తెలుసుకోవాలన్నారు. రాష్ట్ర పాలన గాలికి వదిలి సీఎం కేసీఆర్ ఫాం హౌజ్‌కు పరిమితమయ్యాడని ఆరోపించారు. రాష్ట్రంలో జరిగిన అవినీతి, అక్రమాలలో కేసీఆర్ కుటుంబానికి ప్రత్యక్ష సంబంధాలున్నాయని వివరించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్, సిరికొండ బలరాం, తాటి కృష్ణ, భూక్య రాజు నాయక్, భూక్య జవహర్‌లాల్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.