
యువతకు నైపుణ్య పరీక్షలు నిర్వహిస్తున్న జిల్లా అధికారి పిల్లి శ్రీపతి
ములుగు రూరల్(గోవిందరావుపేట): గిరిజన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటుకు బుధవారం యువతకు నైపుణ్య పరీక్షలు నిర్వహించారు. గోవిందరావుపేట మండల పరిధిలోని కర్లపల్లిలో యువతకు వల విసరడం, వల అల్లికలు, ఈతపై పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ అధికారి పిల్లి శ్రీపతి మాట్లాడారు. కర్లపల్లిలో నిర్వహించిన నైపుణ్య పరీక్షల్లో ప్రతి ఒక్కరూ అర్హత సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ రమేష్, ఐటీడీఏ జిల్లా కో ఆర్డినేటర్ కొమురం ప్రభాకర్, సర్పంచ్ ఈక అంజిబాబు, జీసీసీ డైరెక్టర్ పురుషోత్తం, పీసీ రీజనల్ కోఆర్డినేటర్ సాయిబాబు, సొసైటీ అధ్యక్షుడు నరేందర్, పీసీ మొబిలైజర్ కృష్ణా తదితరులు పాల్గొన్నారు.