
గర్భిణులకు ఆహారాన్ని అందజేస్తున్న అధికారులు
మంగపేట: చిరుధాన్యాల ఆహారం తీసుకోవడం వల్ల తల్లి, పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత అన్నారు. మండల పరిధిలోని రమణక్కపేటలో ఒకటో అంగన్‌వాడీ కేంద్రంలో ఏటూరునాగారం సీడీపీఓ హేమలత ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు తీసుకోవాల్సిన అన్ని రకాల ఆహార పదార్ధాలను ప్రదర్శనగా ఉంచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సంక్షేమ అధికారిణి ప్రేమలత హాజరై మాట్లాడారు. గర్భిణులు, బాలింతలకు చిరుధాన్యాల ప్రత్యేకతను వివరించారు. చిరుధాన్యాల ఆహారంలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు ఉన్నాయన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మహిళా, శిశు సంక్షేమశాఖ ఎస్‌పీఎంయూ కో ఆర్డినేటర్ రాహుల్ సాధు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషలాఫీసర్ తుల రవి, ఎంపీడీఓ శ్రీధర్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ విజయలక్ష్మి, పోషణ్ అభియాన్ సిబ్బది ఇమాన్యుయేల్, బ్లాక్ కో ఆర్డినేటర్ విజేందర్, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.
గర్భిణులకు పోషకాహారం అందించాలి
ములుగు రూరల్: గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించాలని డీడబ్ల్యూఓ ప్రేమలత అన్నారు. మండల పరిధిలోని బండారుపల్లిలోని అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె బాలింతలు, గర్భిణులకు చిరు ధాన్యాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ కమరున్నీసా తదితరులు పాల్గొన్నారు.