
వెంకటాపురం(కె): పోషకాహారంతోనే చిన్నారులు, బాలింతలు ఆరోగ్యంగా ఉంటారని సీడీపీఓ ముత్తమ్మ అన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాయలంలో బాలింతలకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ అంటి నాగరాజు, ఎంపీడీఓ అడ్డూరి బాబు చేతుల మీదుగా న్యూట్రిషన్ కిట్లను బాలింతలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం సర్పంచ్ చిడెం యామిలి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు పుష్పవతి తదితరులు పాల్గొన్నారు.
కుష్ఠువ్యాధి
నిర్మూలనకు చర్యలు
వెంకటాపురం(కె): కుష్ఠు వ్యాధి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర కుష్ఠు వ్యాధి బృందం ప్రతినిధి డీపీఎంఓ వెంకటేశ్వరచారి అన్నారు. మండల పరిధిలోని ఎదిర పీహెచ్‌సీని రాష్ట్ర కుష్ఠువ్యాధి బృందం బుధవారం తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. కుష్ఠువ్యాధిపై ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఏపీఎంఓలు శ్రీని వాస్‌రెడ్డి, జోసఫ్, సురేందర్, జిల్లా అధికారులు, పీహెచ్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.
‘కంటివెలుగు’ శిబిరం తనిఖీ
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఆకులవారిఘణపురం మూడో సబ్ సెంటర్ పరిధిలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని బుధవారం జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారులు అఫ్తాల్మిక్ డాక్టర్ ప్రవీణ్‌కుమార్ తనిఖీ చేశారు. కంటి వెలుగుకు వస్తున్న అంధత్వ సమస్యలున్న వారికి చేస్తున్న పరీక్షలు, ఇస్తున్న అద్దాలను పరిశీలించారు. చేస్తున్న పరీక్షలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. శస్త్ర చికిత్సలు అవసరం ఉంటే రెఫర్ చేయాలని, అద్దాలు కావాల్సిన వారికి తెప్పించి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుమలత, అఫ్తాల్మిక్ ఆఫీసర్ రాజన్న, హెల్త్ ఎడ్యుకేటర్ స్వరూపరాణి, ఏఎన్‌ఎం గీత పాల్గొన్నారు.
సీపీఆర్‌పై
అధికారులకు అవగాహన
ములుగు రూరల్: గోవిందరావుపేట మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో సీపీఆర్‌పై మండల అధికారులకు, ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఈ మేరకు బుధవారం డీఆర్‌డీఓ నాగ పద్మజా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక వ్యక్తి అకస్మాతుగా కిందపడితే సీపీఆర్ చేయాలన్నారు. గుండెపోటుతో పడిపోయిన వారికి 2 నుంచి 8 సార్లు బ్రీత్ ఇవ్వాలన్నారు. సీపీఆర్‌పై అధికారులు ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్ధార్ అల్లం రాజ్‌కుమార్, ఎంపీడీఓ ప్రవీన్‌కుమార్, వైద్యాధికారులు సుకుమార్, మధు, ఎంపీపీ సూడి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


