కంటి పరీక్షలు చేయించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కంటి పరీక్షలు చేయించుకోవాలి

Mar 30 2023 1:48 AM | Updated on Mar 30 2023 1:48 AM

కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలిస్తున్న డీఎంహెచ్‌ఓ - Sakshi

కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలిస్తున్న డీఎంహెచ్‌ఓ

ములుగు రూరల్‌: 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని డీఎంహెచ్‌ఓ అల్లెం అప్పయ్య సూచించారు. మండల పరిధిలోని బండారుపల్లిలో నిర్వహిస్తున్న రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి పరీక్షలు 147 మందికి చేసి 30మందికి రీడింగ్‌ గ్లాసులు, ప్రిస్కిప్షన్‌ గ్లాసెస్‌ 20 మందికి రెఫర్‌ చేసినట్లు తెలిపారు. గ్రామంలో ప్రణాళికతో కంటి పరీక్షలు నిర్వహించాలని డాక్టర్‌ అమూల్య, సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ అక్కల రఘోత్తం, అప్తమాలిక పూర్ణచందర్‌, డీఈఓ, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement