వెంకటాపురం(ఎం): మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని మండల స్పెషల్ అధికారిణి, జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమశాఖ అధికారి భాగ్యలక్ష్మి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం తప్పకుండా విద్యార్థులకు అందించాలన్నారు. పౌష్టికాహార పదార్థాలతో పాటుగా వంటకాలను రుచికరంగా వండాలని సూచించారు. మధ్యాహ్న భోజనాన్ని పిల్లలతో కలిసి భోజనం చేశారు. భోజనం చాలా బాగుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జనగాం బాబురావును అభినందించారు. పాఠశాల ఆవరణతో పాటుగా భోజనం కూడా బాగుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎంసి చైర్మన్ చీకుర్తి రమేష్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు ఫిరోజ్, సాంబయ్య, కిరణ్ కుమార్, శ్రీనివాసులు, మహేష్, జ్యోత్స్న, రికార్డు అసిస్టెంట్ సత్యం, సీఆర్పీ కుమార్ పాడ్య పాల్గొన్నారు.