
విద్యార్థులతో మాట్లాడుతున్న జెడ్పీ సీఈఓ
ఏటూరునాగారం: గుండెపోటు వచ్చిన వారిని సీపీఆర్‌తో ప్రాణాలను కాపాడవచ్చని జెడ్పీ సీఈఓ ప్రసూనరాణి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ఈజీఎస్ సిబ్బందికి సీపీఆర్‌పై మంగళవారం ఎన్‌సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ మంకిడి వెంకటేశ్వర్లు, డాక్టర్ ఛాముండేశ్వరి శిక్షణ ఇచ్చారు. అనంతరం సీఈఓకు సీపీఆర్ చేసే విధానంపై డాక్టర్లు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీపీఆర్ విధానంపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. గుండెపోటు వచ్చిన వారికి సకాలంలో సీపీఆర్ చేసి వారి ప్రాణాలను కాపాడవచ్చన్నారు. అనంతరం జెడ్పీ కో ఆప్షన్ సభ్యులు వలియాబీ, ఎంపీపీ అంతటి విజయ, వైఎస్ ఎంపీపీ తుమ్మ సంజీవరెడ్డి, ఎంపీటీసీ కోట నర్సింహులు మాట్లాడారు. గుండెపోటుపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో కూడా సీపీఆర్ విధానంపై అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు దొడ్డ కృష్ణ, చింత రేణు, పలక చిన్నన్న, వైద్యులు సుచరిత, చంద్రశేఖర్, మాధవి, ఎంపీడీఓ కుమార్, సీహెచ్‌ఓ శారద, హెల్త్ సూపర్‌వైజర్ కమల, స్టాఫ్ నర్సు ఝాన్సీలక్ష్మి, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేయాలి
గ్రామాల్లో నూటికి నూరుశాతం మరుగుదొడ్ల నిర్మాణం పనులు పూర్తి చేయాలని జెడ్పీ సీఈఓ ప్రసూనరాణి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎస్‌బీఎంపై రెండో రోజు శిక్షణ, శివాపురంలో గ్రామ సర్వే మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్లను పూర్తి చేయాలన్నారు. కొత్తగా నిర్మించుకుంటే మంజూరు ఇస్తామన్నారు. అసంపూర్తి నిర్మాణాలు త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని ఈజీఎస్ సిబ్బందిని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కుమార్, ఎస్‌బీఎం జిల్లా కోఆర్డినేటర్ మైమున్నీసా, ట్రైనర్ రహిమొద్దీన్, సర్పంచ్‌లు వంక దేవేందర్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
‘పది’లో ఉత్తీర్ణతశాతం పెరగాలి
పదో తరగతి పరీక్షల్లో కేజీబీవీ విద్యార్థుల ఉత్తీర్ణశాతం పెరగాలని జెడ్పీ సీఈఓ, మండల ప్రత్యేక అధికారిణి ప్రసూనరాణి అన్నారు. మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను ఆమె మంగళవారం తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ఏకాగ్రతతో చదివి పరీక్షల్లో 10/10 జీపీఏ సాధించాలన్నారు.

సీపీఆర్ చేసి చూపిస్తున్న జెడ్పీ సీఈఓ ప్రసూనరాణి