
అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న జీఎం
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని సింగరేణి వర్క్‌షాపు సమీపంలోని బ్యారక్‌లలో చేపడుతున్న గ్రంఽథాలయ అభివృద్ధి పనులను మంగళవారం ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు పరిశీలించారు. బ్యారక్‌లలో చేపడుతున్న మరమ్మతు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌కు సూచించారు. ఎస్టీ అసోసియేషన్ కార్యాలయ పనులను కూడా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు సత్యనారాయణ, రామకృష్ణ, తుకారం, జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్, ఎస్టీ అసోసియేషన్ సభ్యులు మోహన్, హేమనాయక్‌లు పాల్గొన్నారు.