మతసామరస్యానికి ప్రతీక రంజాన్‌ | - | Sakshi
Sakshi News home page

మతసామరస్యానికి ప్రతీక రంజాన్‌

Mar 28 2023 1:42 AM | Updated on Mar 28 2023 1:42 AM

ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న తస్లీమా  - Sakshi

ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న తస్లీమా

వెంకటాపురం(ఎం): మతసామరస్యానికి ప్రతీక రంజాన్‌ మాసమని ములుగు, భూపాలపల్లి జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌ తస్లీమా మహ్మద్‌ అన్నారు. మండల కేంద్రంలోని మైనార్టీ బాలికల జూనియర్‌ కళాశాలలో ఇఫ్తార్‌ విందు సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఆమె ఇఫ్తార్‌ విందులో పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రంజాన్‌ మాసంలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తారన్నారు. ఇస్లాం శాంతి, ప్రేమ, దయాగుణాలను ప్రభోధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ వందన, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement