ఆమె ఉన్నట్టా..లేనట్టా..?.. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా చూశారా? | OTT Movie Reviews: The Woman In Cabin 10 Movie Review In Telugu, A Must Watch Psychological Thriller On Netflix | Sakshi
Sakshi News home page

ఆ గదిలో ఆమె ఉన్నట్టా.. లేనట్టా..? ఓటీటీలో ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చూశారా?

Nov 2 2025 5:47 PM | Updated on Nov 2 2025 6:13 PM

The Woman In Cabin 10 Movie Review In Telugu

థ్రిల్లర్ జోనర్లందు సైకలాజికల్ థ్రిల్లింగే వేరయా...నిజానికి సినిమాల్లో ఉన్న అన్ని జోనర్లలో థ్రిల్లర్ జోనర్ కు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులోను సైకలాజికల్ థ్రిల్లర్ మరింత ప్రత్యేకమైనది, ఎందుకంటే చూసే ప్రేక్షకుడిని ఆద్యంతం కట్టిపడేసేది ఈ సైకలాజికల్ థ్రిల్లరే. నెట్ ఫ్లిక్స్ ఓటిటి వేదికగా ఇటీవలే విడుదలైన సినిమా ది ఉమెన్ ఇన్ కేబిన్ 10(The Woman In Cabin 10 OTT Movie Review) ఈ కోవకు చెందినదే. ప్రముఖ నవలా రచయిత్రి రూత్ వేర్ రాసిన పుస్తకం ఆధారంగా తీసిన ఈ సినిమాను దర్శకులు సైమన్ స్టోన్ తెరకెక్కించారు. నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా లభ్యమవుతోంది. 

ఈ సినిమా చాలా వరకు విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇక ఈ సినిమా కథాంశానికొస్తే...ఇన్వేస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన లారా కు ధనవంతురాలైన అనీబల్మర్ నుండి ఓ ఆహ్వానం అందుతుంది. క్యాన్సర్ బాధితురాలిగా ఆఖరి దశలో ఉన్న అనీబల్మర్ తన యావదాస్తిని తన భర్త అయిన రిచర్డ్ పేరిట రాయడానికి, అలాగే తాను నిర్వహించే స్వచ్ఛంధ సంస్థకు ఫండ్ రైజింగ్ కోసం ప్రపంచంలో ఉన్న ధనవంతులతో పాటు లారాని కూడా ఓ షిప్ ప్రయాణానికి ఆహ్వానిస్తుంది.

 వీరంతా కలిసి ఓ విలాసవంతమైన షిప్ లో నార్వేకి వెళుతుంటారు. లారాకి ఆ షిప్ లో 8వ నెంబరు గదిని కేటాయిస్తారు. రెండు రోజుల ఈ ప్రయాణంలో ప్రతి క్షణం విందులు, వినోదాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అనూహ్యంగా ఓ రోజు రాత్రి 10 వ నెంబరు గది నుండి ఓ అమ్మాయి సముద్రంలోకి పడిపోవడం లారా గమనిస్తుంది. ఇదే విషయం నిర్వాహకులకు చెబితే ఆ గదిని ఎప్పుడూ తెరవలేదని, దాంట్లో ఎవరూ లేరని లారాకు చెబుతారు. 

లారా వాళ్ళ మాటలు నమ్మదు, ఇంతలో లారా పై కూడా ఓ హత్యా ప్రయత్నం జరుగుతుంది. ఆ 10వ నెంబరులో ఉన్న అమ్మాయి ఎవరో, ఎందుకు పడిపోయిందో తెలుసుకోవడానికి లారా శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతకీ ఆ గదిలో ఆమె ఉన్నట్టా లేనట్టా, అలాగే లారా పై హత్యాయత్నం చేసిందెవరు ? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానలు కావాలంటే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ది ఉమెన్ ఇన్ కేబిన్ 10 సినిమాని చూడాల్సిందే. అక్కడక్కడా కాస్త స్లో గా అనిపించినా ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మస్ట్ వాచ్ ఫర్ ది వీకెండ్. ఫైండ్ అవుట్ ది ఉమెన్ ఇన్ కేబిన్ 10 దిస్ వీక్.
- హరికృష్ణ ఇంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement