విశాల్‌ 'సామాన్యుడు' కాదు | Vishal 31 Titled As Samanyudu, First Look Released | Sakshi
Sakshi News home page

Vishal: విశాల్‌ 'సామాన్యుడు' కాదు

Aug 30 2021 7:35 AM | Updated on Aug 30 2021 7:39 AM

Vishal 31 Titled As Samanyudu, First Look Released - Sakshi

Hero Vishal: విశాల్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘సామాన్యుడు’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘నాట్‌ ఎ కామన్‌ మ్యాన్‌’ అనేది ఉపశీర్షిక. తు.ప. శరవణన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో డింపుల్‌ హయతి హీరోయిన్‌. విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఆదివారం (ఆగస్టు 29)న విశాల్‌ బర్త్‌ డే సందర్భంగా ‘సామాన్యుడు’ టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

‘‘విశాల్‌ నటించిన పలు సినిమాలకు సంగీతం అందించిన యువన్‌ శంకర్‌ రాజా ‘సామాన్యుడు’ కి కూడా సంగీతం అందిస్తున్నారు. కవిన్‌ రాజ్‌ మంచి విజువల్స్‌ ఇస్తున్నారు. ఈ సినిమాను త్వరలో థియేటర్స్‌లో విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement