ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్‌ సేతుపతి థ్రిల్లర్‌ మూవీ.. | Vijay Sethupathi And Katrina Kaif Starrer Merry Christmas Movie OTT Release Date Confirmed, Streaming Platform Details - Sakshi
Sakshi News home page

సడన్‌గా ఓటీటీలోకి వచ్చేస్తున్న థ్రిల్లర్‌ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Mar 7 2024 1:38 PM | Updated on Mar 7 2024 5:09 PM

Vijay Sethupathi, Katrina Kaif Starrer Merry Christmas OTT Release Date - Sakshi

హీరోగా, విలన్‌గా, హీరోయిన్‌ తండ్రిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా.. రకరకాల పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్నాడు. పాత్ర నచ్చాలే కానీ ఏదైనా ఓకే అంటున్నాడు. ఈ

భాషాభేదం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోగా, విలన్‌గా, హీరోయిన్‌ తండ్రిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా.. రకరకాల పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్నాడు. పాత్ర నచ్చాలే కానీ ఏదైనా ఓకే అంటున్నాడు. ఈయన ఇటీవల హీరోగా నటించిన చిత్రం మెర్రీ క్రిస్‌మస్‌. హిందీ, తమిళ భాషల్లో రూపొందిన ఈ మూవీలో స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ నటించింది.

బాలీవుడ్‌ డైరెక్టర్‌ శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వం వహించాడు. టిప్స్‌ ఫిలింస్‌, మ్యాచ్‌ బాక్స్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ పలుమార్లు వాయిదా పడి చివరకు జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా కలెక్షన్స్‌ రాబట్టలేకపోయింది. దాదాపు రెండు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. నేడు అర్ధరాత్రి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. ముందుగా హిందీ, తమిళ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.

చదవండి: వేడుకలకు పిలుపు లేదనే అక్కసుతో అనంత్‌ అంబానీ బరువుపై హీరోయిన్‌ కామెంట్లు

Advertisement
 
Advertisement
Advertisement