రియల్ 'ఫ్యామిలీ స్టార్' ఇంటికి వెళ్లిన విజయ్ దేవరకొండ | Vijay Devarakonda Meet real Family Star | Sakshi
Sakshi News home page

రియల్ 'ఫ్యామిలీ స్టార్' ఇంటికి వెళ్లిన విజయ్ దేవరకొండ

Published Tue, Apr 9 2024 7:49 AM | Last Updated on Tue, Apr 9 2024 10:25 AM

Vijay Devarakonda Meet real Family Star - Sakshi

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. పరశురామ పెట్ల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు, శిరీష్‌ ఈ సినిమాను నిర్మించారు. సినిమా బాగున్నప్పటికీ కొందరు కావాలనే విజయ్‌ దేవరకొండను టార్గెట్‌ చేసి సినిమా బాగాలేదని విపరీతంగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయినా కూడా ఫ్యామిలీ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్ట్‌ అయింది. అందుకే బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది.

ప్రతి కుటుంబంలో ఒకరు తన వారందరి కోసం కష్టపడుతూనే ఉంటారు. అందుకోసం ఎంతటి కష్టాన్ని అయినా భరిస్తారు. ఇదే పాయింట్‌తో సినిమా ఉంది. ఈ విషయాన్ని నిర్మాత దిల్‌ రాజు ముందే చెప్పారు. సినిమా విడుదలకు ముందు  దిల్​ రాజు ప్రమోషన్స్​ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో పాల్గొన్న ప్రశాంత్ అనే యువకుడు వారి కుటుంబంలో 'ఫ్యామిలీ స్టార్'గా తన చెల్లెలు ఉన్నారని చెప్పాడు. వారి కుటుంబం కోసం దివ్యాంగురాలైన ఆమె పడిన కష్టాన్ని ఆ యువకుడు దిల్‌ రాజు ముందు చెప్పాడు. దీంతో దిల్‌ రాజు కూడా కాస్త ఎమోషనల్‌ అయ్యాడు. సినిమా విడుదల తర్వాత తప్పకుండా మీ ఇంటికి వస్తాను.. ఆ రియల్‌ ఫ్యామిలీ స్టార్‌ను కలుస్తానని మాట ఇచ్చాడు.

ఇచ్చిన మాట ప్రకారం హైదరాబాద్‌లోని సూరారంలో ఉన్న ఆ యువకుడి ఇంటికి దిల్‌ రాజు, విజయ్‌ దేవరకొండ, డైరెక్టర్‌ పరుశురాం వెళ్లారు. ఆ కుటుంబాన్ని సర్‌ప్రైజ్‌ చేశారు. కొంత సమయం పాటు ఆ కుటుంబ సభ్యులందరితో సరదాగ వారు గడిపారు. దివ్యాంగురాలైన ఆమె తన కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు అడ్డుగా ఉన్నా చదువును పూర్తి చేసి ఉద్యోగం రాకపోతే కిరాణ షాపును నడపడం ఆపై ఎంతో కష్టపడి అమెజాన్‌లో ఉద్యోగం తెచ్చుకోవడం.. దాంతో వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం వంటి అంశాలను ఆ యువకుడు పంచుకున్నాడు. ఆ వీడియో ఇప్పడు నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement