
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న 'మదరాసి'(Madharaasi )చిత్రం నుంచి రెండో సాంగ్ విడుదలైంది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్ నటిస్తుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన మొదటి సాంగ్‌తో పాటు పోస్టర్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదలైన వీడియో సాంగ్ కూడా మెప్పించేలా ఉంది. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటను ఆదిత్య ఆర్కే ఆలపించారు.
శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబరు 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం సరికొత్త ఎగ్జయిటింగ్ యాక్షన్ ప్యాక్డ్ కథను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో విద్యుత్ జమాల్, బిజు మీనన్, షబ్బీర్, విక్రాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.