Sushant Singh Rajput's Death Case: రియాను కావాలనే ఈ కేసులో ఇరికించారా, స్వర భాస్కర్‌ | Swara Bhasker Alleges Media for Framing Rhea Chakraborty - Sakshi
Sakshi News home page

రియాను కావాలనే ఈ కేసులో ఇరికించారా: స్వర భాస్కర్‌

Aug 31 2020 3:34 PM | Updated on Aug 31 2020 5:28 PM

Swara Bhasker Asks if Rhea Chakraborty is Being Framed - Sakshi

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. సుశాంత్‌ ప్రేమికురాలు రియా చక్రవర్తి.. అతడికి తెలియకుండా డ్రగ్స్‌ ఇచ్చేదని.. డబ్బు తీసుకుందని సుశాంత్‌ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాక సుశాంత్‌ మెంటల్‌ హెల్త్‌ కండిషన్‌ గురించి రియా తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని నటుడి కుటుంబ సభ్యులు గతంలో ఆరోపించారు. మీడియాలో కూడా రియాకు సంబంధించి అనేక కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో నటి స్వర భాస్కర్‌ రియాకు మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం.. మీడియా, రియాను కసబ్‌ కన్నా దారుణంగా వేధిస్తుందని విమర్శించారు స్వర. తాజాగా రియాను ఈ కేసులో కావాలనే ఇరికించారంటున్నారు స్వర. అంతేకాక సుశాంత్‌ మానసిక అనారోగ్యం గురించి అతడి మాజీ మేనేజర్‌ శ్రుతి మోదీకి, అతడికి సోదరికి మధ్య జరిగిన వాట్సాప్‌ చాట్‌ స్క్రీన్‌ షాట్స్‌ని ట్వీట్‌ చేశారు స్వర. (చదవండి: రియాకు న్యాయం జ‌ర‌గాలి: మ‌ంచు ల‌క్ష్మి)

2019, నవంబర్‌ 26న జరిగిన ఈ వాట్సాప్‌ చాట్‌లో శ్రుతి.. సుశాంత్‌ సోదరి నీతుకి ఓ ప్రిస్కిప్షన్‌ని మెసేజ్‌ చేసింది. దాంతో పాటు సుశాంత్‌కు వైద్యం చేస్తోన్న సైక్రియాట్రిస్ట్‌ సుసాన్‌ వాకర్‌ ఫోన్‌ నంబర్‌ని కూడా సెండ్‌ చేసింది. దీనికి బదులుగా నీతు.. ఆ వైద్యుడిని కలవాలని ఉందంటూ రిప్లై కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ వాట్సాప్‌ చాట్‌ కాస్త సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించి అజయ్‌ కుమార్‌ అనే జర్నలిస్ట్‌ ట్వీట్‌ని రీట్వీట్‌ చేసిన స్వర.. ‘హేయ్‌ మనస్సాక్షి లేని యాంకర్స్‌.. రియా చక్రవర్తి, సుశాంత్‌ సింగ్‌ మానసిక అనారోగ్యం గురించి అతడి కుటుంబ సభ్యులకు తెలియజేసిందని ఈ వాట్సాప్‌ చాట్‌ నిరూపిస్తోంది. గట్టిగా అరుస్తూ.. డిబెట్లు నిర్వహించే యాంకర్లు దీన్ని విస్మరించారు ఎందుకు. చూడబోతే రియాను కావాలనే ఈ కేసులో ఫ్రేమ్‌ చేసినట్లు అనిపిస్తోంది’ అంటూ స్వర ట్వీట్‌ చేశారు. సుశాంత్‌ మానసిక అనారోగ్యం గురించి రియా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ హీరో కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలు వాస్తవం కాదని ఈ చాట్‌తో స్పష్టమవుతోంది. ఇక సుశాంత్‌ బైపోలార్‌ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు ప్రిస్క్రిప్షన్‌లో ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement