Sivakarthikeyan Announces Next With Jathi Ratnalu Director KV Anudeep - Sakshi
Sakshi News home page

KV Anudeep: జాతిరత్నాలు డైరెక్టర్‌తో స్టార్‌ హీరో సినిమా అనౌన్స్‌మెంట్‌

Jan 1 2022 5:43 PM | Updated on Jan 1 2022 6:29 PM

Sivakarthikeyan Announces Next With Jathi Ratnalu Director KV Anudeep - Sakshi

Sivakarthikeyan Announces Next With Jathi Ratnalu Director KV Anudeep: జాతిరత్నాలు సినిమాతో కడుపుబ్బా నవ్వించిన డైరెక్టర్‌ అనుదీప్‌. డైరెక్టర్‌గా తొలి సినిమాతోనే సక్సెస్‌ అయ్యాడు. ఈ నేపథ్యంలో తన తర్వాతి ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేశాడు. న్యూ ఇయర్‌ సందర్భంగా తన నెక్ట్స్‌ సినిమాను ప్రకటించాడు. కోలీవుడ్‌ స్టార్‌ హీరో శివ కార్తికేయన్‌తో ఆయన సినిమాను తెరకెక్కించనున్నారు. తెలుగులో ఈయనకు ఇదే మొదటి చిత్రం. 

సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దీనికి  ఎస్‌కే 20 అనే వర్కింగ్‌ టైటిల్‌ను పెట్టారు. ఇక ఎస్ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఇప్పటికే రెమో చిత్రంతో  శివ కార్తికేయన్‌ తెలుగు వారికి ఎంతో దగ్గరయ్యారు. ఇటీవలె ఈయన నటించిన డాక్టర్‌ సైతం విడుదలైంది. 

Advertisement
 
Advertisement
Advertisement