Jubin Nautiyal: హీరోయిన్‌తో డేటింగ్‌పై తొలిసారి నోరు విప్పిన సింగర్‌..

Singer Jubin Nautiyal Breaks Silence On Dating With Nikita Dutta - Sakshi

ప్రేమలు, పెళ్లిల్లు, విడాకుల వార్తలు, పుకార్లు బీటౌన్‌లో సర్వసాధారణం. వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారట, వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట అనే వార్తలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ వార్తలపై వాటికి సంబంధించిన వారు కావాలనుకుంటే స్పందిస్తారు.. లేకుంటే లైట్ తీసుకుంటారు. తాను ఓ హీరోయిన్‌తో డేటింగ్‌ చేస్తున్నాడని వస్తున్న వార్తలపై తొలిసారిగా స్పందించాడు బాలీవుడ్‌ ఫేమస్ సింగర్‌ జుబిన్‌ నౌటియాల్. ఇటీవల ఉత్తరాఖండ్‌లో ఉన్న జుబిన్‌ ఫ్యామిలీని చూసేందుకు కబీర్ సింగ్‌ ఫేం నికితా దత్తా వెళ్లడంతో ఈ పుకార్లు ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా జుహులోని ఒక కేఫ్‌లో జుబిన్, నికితా కనిపించడం, పలుమార్లు ఎయిర్‌పోర్ట్‌ నుంచి జుబిన్‌ను నికితా పిక్ అప్‌ చేసుకోవడం, తరచుగా ఒకరి సోషల్ మీడియా పోస్ట్‌లకు ఒకరు కామెంట్స్‌ చేసుకోవడం ఈ వార్తలకు మంచి ఊపొచ్చింది. 

చదవండి: రెండో పెళ్లికి రెడీ అయిన స్టార్‌ హీరో ?

ఈ సన్నివేశాలతో వారి రెండు కుటుంబాలు కలిశాయని, వారిద్దరికీ పెళ్లి చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని వార్తలు నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి. అయితే ఇప్పటివరకూ ఈ వార్తలపై ఏ ఒక్కరూ రియాక్ట్‌ కాలేదు. తాజాగా ఈ విషయంపై సింగర్ జుబిన్‌ నౌటియాల్ నోరు విప్పాడు. 'ఈ విషయంపై మేము చెవిటి వాళ్లలా మౌనంగా ఉన్నాం. ఏక్ దుజే కే వాస్తే టీవీ షో నుంచి నికితా నాకు స్నేహితురాలు. ఆ కార్యక్రమంలో నేను ఒక పాట పాడాను. అప్పటినుంచే ఒకరికొకరం తెలుసు. చాలాకాలంగా నేను నికితా జుహు కేఫ్‌కు వెళ్తూ మాట్లాడుకునేవాళ్లం. మేము డేటింగ్‌ చేస్తున్నామా? లేదా ? అనే విషయం నాకు చెప్పాలని లేదు. ఎందుకంటే.. ఏం చెబితే అది ఎటువైపు దారితీస్తుందో చెప్పలేం. అందరి దృష్టి మాపై ఉండేలా ఇరకాటంలో పడటం మాకు ఇష్టం లేదు.' అని జుబిన్ చెప్పినట్లుగా బాంబే టైమ్స్‌ వెల్లడించింది. 

చదవండి: రెండుసార్లు విడాకులు: తొలిసారి స్పందించిన ఆమీర్‌ ఖాన్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top