తను లేకపోతే నాకు జీవితమే లేదు..ఆ వదంతులు నమ్మొద్దు: షకీలా

చెన్నై: తన గురించి ప్రసారం అవుతున్న వదంతులను నమ్మొద్దని సంచలన నటి షకీలా పేర్కొన్నారు. శృంగార తార షకీలా ప్రస్తుతం టీవీ కార్యక్రమాలకు ప్రాముఖ్యత ఇస్తున్న ఈమె గురించి ఒక షాకింగ్ న్యూస్ ప్రచారంలో ఉంది. షకీలా మరణించారన్నదే ఆ వార్త. ఈ ప్రచారంతో షకీలా దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో తన ఆరోగ్యం గురించి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం తనని దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ ఓ వీడియో విడుదల చేశారు.
తాను ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. ఇలాంటి వదంతులను ఎవరూ నమ్మొద్దని ఆమె పేర్కొన్నారు. ఈమె మిలా అనే అమ్మాయిని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. తను దత్తపుత్రికతో తీసుకున్న ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. మిలా లేకపోతే తాను లేను తనకు జీవితమే లేదు తనకు తోడు మిలానే అని షకీలా పేర్కొన్నారు.
దత్తపుత్రికతో షకీల (పైల్)
Actress #Shakeela dismisses rumors about her and her health..
She is doing absolutely fine..@Royalreporter1 pic.twitter.com/ut41SrRGG4
— Ramesh Bala (@rameshlaus) July 29, 2021