ఓటీటీలో దూసుకెళ్తున్న 'ఫర్జీ'.. ఆల్‌ టైమ్ రికార్డ్ | Sakshi
Sakshi News home page

Farzi: అదరగొడుతున్న 'ఫర్జీ'.. ఇండియన్ ఓటీటీలో ఆల్ టైమ్ రికార్డ్

Published Sun, Mar 26 2023 1:04 PM

Shahid Kapoor Farzi Web series Creates All Time Viewership In Amazon Prime - Sakshi

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, హీరోయిన్ రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'ఫర్జీ'. ది ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌ సిరీస్‌తో సంచలన విజయం సాధించిన డైరెక్టర్స్‌ రాజ్‌-డీకేలు తెరకెక్కించారు. ఈ సిరీస్‌ ఫిబ్రవరి 10న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలై ఓటీటీలో దూసుకెళ్తోంది. 

తాజాగా ఈ వెబ్ సిరీస్ ఇండియన్ ఓటీటీలోనే ఆల్‌ టైమ్ వ్యూయర్‌షిప్‌ను సాధించింది. ఇప్పటివరకు 37 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు ఓర్‌మ్యాక్స్ మీడియా అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని నటుడు షాహిద్ కపూర్ కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అజయ్‌ దేవగణ్ నటించిన రుద్ర 35.2 మిలియన్ల వ్యూస్‌తో రెండోస్థానంలో నిలిచింది. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement