బాలీవుడ్‌ హీరోతో రాశీ ఖన్నా రొమాంటిక్‌ పాటలు! | Raashi Khanna cast opposite Shahid Kapoor in a web series | Sakshi
Sakshi News home page

సరదా మాటలు.. రొమాంటిక్‌ పాటలు!

Apr 11 2021 6:21 AM | Updated on Apr 11 2021 8:13 AM

Raashi Khanna cast opposite Shahid Kapoor in a web series - Sakshi

సెట్‌లో పాటలు పాడుకుంటున్నారు హీరోయిన్‌ రాశీ ఖన్నా, షాహిద్‌కపూర్‌. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌ సిరీస్‌ సక్సెస్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్న రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ఓ వెబ్‌ సిరీస్‌లో షాహిద్‌ కపూర్, రాశీ ఖన్నా లీడ్‌ రోల్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం షాహిద్, రాశీ కాంబినేషన్‌లోని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ ఇద్దరిపై రొమాంటిక్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా తెలిసింది. సన్నివేశాలతో పాటు పాటలు కూడా చిత్రీకరిస్తున్నారట. వచ్చే ఏడాది ఈ వెబ్‌సిరీస్‌ ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... రాశీ ఖన్నా నటిస్తున్న తొలి వెబ్‌సిరీస్‌ ఇదే కావడం విశేషం. ప్రస్తుతం తెలుగులో గోపీచంద్‌ ‘పక్కా కమర్షియల్‌’, నాగచైతన్య ‘థ్యాంక్యూ’ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తున్నారు రాశీఖన్నా.


లొకేషన్‌లో షాహిద్‌ కపూర్‌తో...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement