
విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈనెల 21నే ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కానుంది. ఆ తర్వాత ఇదే నెల 23నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఫస్ట్ షెడ్యూల్‌ను కశ్మీర్‌లో ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో విజయ్ ఆర్మీ అధికారిగా కనిపించనున్నట్లు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇక 'మజిలీ' తరువాత శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత చేస్తున్న ప్రాజెక్ట్ కావడం, విజయ్ ఇందులో హీరోగా చేయడంతో ఈ సినిమాపై ఎంతో ఆసక్తి నెలకొంది. చదవండి: ఆ గాయం తగ్గడానికి ఆరు నెలలు పట్టింది : సమంత