విజయ్‌, సమంతల 'ఖుషీ' మూవీపై అప్‌డేట్‌ ఇచ్చిన డైరెక్టర్‌ | Director Shiva Nirvana Gives An Update On Kushi Movie | Sakshi
Sakshi News home page

Kushi Movie : విజయ్‌, సమంతల 'ఖుషీ' మూవీపై అప్‌డేట్‌ ఇచ్చిన డైరెక్టర్‌

Mar 5 2023 5:07 PM | Updated on Mar 5 2023 5:11 PM

Director Shiva Nirvana Gives An Update On Kushi Movie - Sakshi

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమా ఖుషి. లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మూవీ లవర్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే సమంత అనారోగ్యం కారణంగా ఇప్పటివరకు షూటింగ్‌ ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడు సామ్‌ కోలుకోవడంతో త్వరలోనే షూటింగ్‌ తిరిగి ప్రారంభం కానుంది

రెండు నెలల్లోనే షూటింగ్‌ పూర్తి చేసి సమ్మర్‌లో ఖుషీని రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ గట్టిగానే ప్లాన్‌ చేస్తున్నారట. తాజాగా ఈ మూవీకి సంబంధించి డైరెక్టర్‌ శివ నిర్వాణ క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు. .యాక్షన్‌ సీక్వెన్స్ తో ఖుషి కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కానుంది అంటూ పాపులర్ స్టంట్‌ మాస్టర్‌ పీటర్ హెయిన్స్, ఎడిటర్‌ ప్రవీణ్ పూడితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు. ఫిల్మ్‌సర్కిల్స్‌లో అందుతున్న సమాచారం ప్రకారం.. ఈనెల 8 నుంచి ఖుషీ కొత్త షెడ్యూల్‌ షురూ కానున్నట్లు తెలుస్తుంది. 


 

Advertisement
 
Advertisement
Advertisement