Rgv Reaction On Liger Team With Mike Tyson Photos - Sakshi
Sakshi News home page

Rgv Reaction: 'లైగర్‌' మూవీ ఫొటోలు షేర్‌.. పూరీపై ఆర్జీవి కామెంట్స్

Nov 17 2021 6:13 PM | Updated on Nov 17 2021 9:10 PM

Rgv Reaction On Liger Team With Mike Tyson Photos - Sakshi

Rgv Reaction On Liger Team With Mike Tyson Photos: డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ కాంబొలో వస్తున్న క్రేజీ మూవీ 'లైగర్'. ఈ సినిమాలో ప్రముఖ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ ఓ కీలక పాత్రలో కనిపిస్తారన్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం సరికొత్త షెడ్యూల్‌ మంగళవారం లాస్‌ వెగాస్‌లో ప్రారంభమైంది. విజయ్-మైక్‌టైసన్‌లపై కీలక సన్నివేశాలు, క్లైమాక్స్‌ చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం కొన్ని ఫొటోలతో షేర్‌ చేసుకుంది. మైక్‌ టైసన్‌తో షూట్‌ ఎంతో సరదాగా ఉందని టీమ్‌ తెలిపింది. 

లైగర్‌ చిత్రం బృందం షేర్‌ చేసిన ఫొటోలపై కాంట్రవర్సీల దర్శకుడు రాంగోపాల్‌ వర్మ స్పందించారు. డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ అచ్చం మైక్‌టైసన్‌ల కఠినంగా ఉ‍న్నాడని రామ్‌గోపాల్ వర్మ తెలిపారు. 'వన్‌ అండ్‌ ఓన్లీ మైక్‌ టైసన్‌తో లైగర్‌ ఫ్యామిలీ' అని క్యాప్షన్‌ ఇచ‍్చారు. కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామాగా లైగర్‌ తెరకెక్కుతోంది. ఇందులో విజయ్‌ బాక్సర్‌గా విభిన్నమైన లుక్‌లో పొడవాటి జుత్తుతో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా బాలీవుడ్‌ నటి అనన్యా పాండే అలరించనున్నారు. పాన్‌ ఇండియా మూవీగా సిద్ధమవుతోన్న ఈ చిత్రానికి చార్మితోపాటు కరణ్‌ జోహార్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement