Ravi Teja's 'Ravanasura' Teaser is Out - Sakshi
Sakshi News home page

Ravanasura Teaser: రావణాసురుడిగా అదరగొట్టేసిన రవితేజ

Mar 6 2023 1:35 PM | Updated on Mar 6 2023 2:20 PM

Ravi Teja Ravanasura Teaser Out - Sakshi

సీతను తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు. ఈ రావణాసురిడిని దాటి వెళ్లాలి' అని మాస్‌ మహారాజ చెప్పిన డైలాగ్‌ అదిరిపోయింది. చివర్లో డేంజర్‌ అంటూ హీరోను చూపించారు. టీజర్‌ అయితే అదిరిపోయిందంటున్నారు

మాస్‌ హీరో రవితేజ లాయర్‌గా నటిస్తున్న చిత్రం రావణాసుర. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాశ్‌, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్‌, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరో సుశాంత్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. సోమవారం ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ చేశారు. ఒక నేరస్థుడు ఓ అమ్మాయిని వెంబడించడంతో టీజర్ మొదలైంది. తర్వాత ఫ్రేమ్‌లో ఒక అమ్మాయి శరీరం మొత్తం రక్తంతో తడిసిపోయి విగతజీవిగా పడి ఉండటం కనిపిస్తోంది. “ప్రతి క్రిమినల్ తను చేసిన క్రైమ్ మీద వాడి సంతకం వదిలేసి వెళ్లిపోతాడు... ఆ సంతకం కోసం వెతకండి” అంటూ హత్య కేసును ఛేదించే అధికారిగా పాత్రలో జయరామ్‌ కనిపించాడు.

రవితేజ లాయర్‌గా పరిచయం అయ్యాడు. కానీ ఈవిల్ స్మైల్ ఇవ్వడం, యాక్షన్‌లోకి దిగినప్పుడు గర్జించడం వంటివి ఆసక్తికరంగా ఉన్నాయి. చివరగా సుశాంత్ పరిచయం అయ్యాడు. 'సీతను తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు. ఈ రావణాసురిడిని దాటి వెళ్లాలి' అని మాస్‌ మహారాజ ఇచ్చిన వార్నింగ్‌ అదిరిపోయింది. చివర్లో డేంజర్‌ అంటూ హీరోను చూపించారు. టీజర్‌ అయితే అదిరిపోయిందంటున్నారు అభిమానులు. అభిషేక్‌ నామా, రవితేజ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్దన్‌ రామేశ్వర్‌, భీమ్స్‌ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్‌ 7న సినిమా విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement