'పుష్ప 2' కంప్లీట్.. చాలాసేపు ఏడ్చిన రష్మిక | Rashmika Got Emotional After Pushpa 2 Shoot Completed | Sakshi
Sakshi News home page

Rashmika: ఐదేళ్లు ప్రయాణం.. బాధంతా బయటపెట్టిన రష్మిక

Nov 27 2024 11:19 AM | Updated on Nov 27 2024 11:26 AM

Rashmika Got Emotional After Pushpa 2 Shoot Completed

'పుష్ప 2' షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ చెప్పాడు. దీంతో ఫ్యాన్స్.. హమ్మయ్యా అనుకున్నారు. మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. టీమ్ అంతా ఎవరి హడావుడిలో వాళ్లు ఉన్నారు. హీరోయిన్ రష్మిక మాత్రం చిత్రీకరణ పూర్తవడంతో తెగ బాధపడిపోతోంది. చాన్నాళ్ల తర్వాత చాలాసేపు కన్నీళ్లు పెట్టుకున్నట్లు చెప్పింది. ఇన్ స్టాలో తన ఎమోషన్ అంతా బయటపెట్టింది.

(ఇదీ చదవండి: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజ్)

'నవంబర్ 25.. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. ఎలా స్పందించాలో అర్థం కావట్లేదు. కానీ వివరించి చెబుతా. 24న షూటింగ్ పూర్తి చేసుకుని, ఫ్లైట్‌లో చెన్నై వెళ్లాం. రాత్రికి తిరిగి హైదరాబాద్ వచ్చేశాం. 4-5 గంటలు నిద్రపోయి.. 'పుష్ప' చివరి రోజు షూటింగ్‌కి బయలుదేరా. క్రేజీ పాటని చిత్రీకరించారు(త్వరలో దీని డీటైల్స్ మీకు తెలుస్తాయి). రోజంతా ఆ పాటతోనే గడిచిపోయింది. ఇది నాకు చివరిరోజు షూటింగ్ అని తెలుసు. కానీ ఎందుకో నాకు అలా అనిపించలేదు'

'నా ఏడెనిమిదేళ్ల కెరీర్‌లో ఐదేళ్లు ఈ సెట్‌లోనే ఉన్నాయి. ఇది నాకు రెండో ఇల్లు అయిపోయింది. ఇంకా బోలెడు పని ఉంది. బహుశా పార్ట్-3 కూడా ఉండొచ్చు. ఈ ఫీలింగ్ చాలా వితంగా ఉంది. ఇక్కడితో ఇది ముగిసిపోయిందని బాధగా ఉంది. అన్ని రకాల ఎమోషన్స్ వచ్చేశాయి. బాగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. కానీ నేనెంతో గ్రేట్ అనిపిస్తోంది. నేను అందరికీ చాలా మిస్ అవుతా. చాలారోజుల తర్వాత చాలాసేపు ఏడ్చాను కూడా. అసలు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నానా అని నాకు అర్థం కావట్లేదు. కానీ ఎంతోమంది అద్భుతమైన వ్యక్తులతో పనిచేయడం మాత్రం మర్చిపోలేను'

(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి.. అవన్నీ రూమర్స్ మాత్రమే)

'మిగతా వాళ్ల కంటే అల్లు అర్జున్ సర్, సుకుమార్ సర్ నన్ను ఎక్కువగా చూశారు. 'పుష్ప' సెట్ నాకు మరో ఇల్లు అయిపోయింది. కానీ బాధతో దాన్ని విడిచిపెట్టాల్సి వస్తోంది. నవంబర్ 25 అనేది నాకు చాలా కష్టమైన రోజు. కానీ దీనికి ప్రతిఫలం ఓ రోజు దొరుకుతుంది' అని రష్మిక తన భావోద్వేగాలన్నీ బయటపెట్టింది.

డిసెంబరు 5న 'పుష్ప 2' వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే బోలెడంత బజ్ వచ్చింది. పాజిటివ్ టాక్ వస్తే చాలు రూ.1000 కోట్ల వసూళ్లు పక్కా అని అంటున్నారు. ఈ మూవీ వల్ల అల్లు అర్జున్‌కి ఎంత కలిసొచ్చిందో రష్మికకు కూడా అంతకుమించి కలిసొచ్చిందని చెప్పొచ్చు. 'పుష్ప' ముందు వరకు రష్మిక ఓ సాధారణ హీరోయిన్. ఈ సినిమా దెబ్బకు పాన్ ఇండియా ఫేమ్, ఆఫర్లు బోలెడన్ని వచ్చాయి. ఇప్పుడు రష్మిక దరిదాపుల్లో వేరే హీరోయిన్ లేదని చెప్పొచ్చు.

(ఇదీ చదవండి: 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)

Advertisement
 
Advertisement
Advertisement