Ranbir Kapoor: 10th క్లాస్‌లో బిలో యావరేజ్ మార్కులు, కానీ ఇంట్లో పండగ చేశారు

కొత్త పెళ్లి కొడుకు రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అతడు నటించిన బ్రహ్మాస్త్ర, షంషేరా, బ్రహ్మాస్త్ర సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్లలో చురుకుగా పాల్గొంటున్న ఈ హీరో తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ప్లూయెన్సర్ డాలీ సింగ్‌తో జరిపిన చిట్‌చాట్‌లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. గణితం ఎంచుకుంటావా? సామాన్య శాస్త్రం ఎంచుకుంటావా? అని అడగ్గా అకౌంట్స్ అని బదులిచ్చాడు రణ్‌బీర్. చదువుల్లో వీకా? అని అడగ్గా చాలా వీక్ అని ఆన్సరిచ్చాడు.
పదో తరగతిలో ఎన్ని మార్కులొచ్చాయని ప్రశ్నించగా 53.4% వచ్చిందని టపీమని చెప్పాడు. ఏంటీ? అంత తక్కువా? అని డాలీ ఆశ్చర్యపోగా రణ్‌బీర్ మాత్రం తను పాసైనందుకు ఇంట్లోవాళ్లు పార్టీ ఏర్పాటు చేశారని వెల్లడించాడు. ఎందుకంటే తన కుటుంబంలో ఇంతవరకు ఎవ్వరూ పదో తరగతి పాసైన దాఖలాలు లేవని, దీంతో తాను ఆమాత్రం మార్కులు తెచ్చుకుంటానని కూడా ఇంట్లోవాళ్లు ఊహించలేదన్నాడు. అది యావరేజ్ మార్కులే అయినప్పటికీ మా ఇంట్లో పది పాసైన మొదటి వ్యక్తిని తానేనన్నాడు. ఇకపోతే రణ్‌బీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి 8, అంకుల్ 9, తాతయ్య 6వ తరగతి ఫెయిల్ అయినట్లు వెల్లడించాడు.
చదవండి: 'మాసూమ్'తో మాయ చేస్తున్న సమారా
ప్రియుడిని పెళ్లాడిన నటి, వెడ్డింగ్ ఫొటోలపై ఫ్యాన్స్ అసంతృప్తి!
మరిన్ని వార్తలు