Rana Daggubati | Sai Pallavi: Virataparvam Release On July 1st In Theatres - Sakshi
Sakshi News home page

Rana-Virataparvam Release Date: రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది, ఆ రోజే బిగ్‌స్క్రీన్‌పై సందడి

May 6 2022 5:31 PM | Updated on May 7 2022 8:12 AM

Rana Daggubati Virataparvam Release On July 1st In Theatres - Sakshi

Makers Announce Virata Parvam Release Date: ఎట్టకేలకు విరాట పర్వం రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు మేకర్స్‌. రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ఎప్పుడో షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. కానీ ఈ చిత్రం నుంచి ఇంతవరకు ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. అంతేకాదు రిలీజ్‌ డేట్‌పై కూడా స్పష్టత లేకపోడంతో మూవీ రిలీజ్‌పై ఎన్నో ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ చిత్రం ఓటీటీలో విడుదల అవుతుందని పుకార్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో వాటన్నింటికి చెక్‌ పెడుతూ మూవీ విడుదల తేదీని తాజాగా ప్రకటించింది చిత్ర బృందం.

చదవండి: ఉపాసన.. నా మైండ్‌లోనూ అదే ఉంది, కానీ మనం కొద్ది రోజులు ఆగాల్సిందే!

ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని జులై 1న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ సోషల్‌ మీడియా వేదికగా అధికారిక ప్రకటన ఇచ్చింది. కాగా విప్లవాత్మకమైన ప్రేమకథగా వస్తున్న విరాటపర్వంలో రానా కామ్రేడ్‌ రవన్నగా నటిస్తుండగా ప్రియమణి ముఖ్య పాత్రలో కనిపించనుంది. ద‌గ్గుబాటి సురేశ్ బాబు సమర్పణలో సుధాక‌ర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement