Virata Parvam: ఛలో ఛలో ఛలో విప్లవ సాంగ్ వచ్చేసింది..

రానా, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాను డి. సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 1990ల సమయంలో జరిగే కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఆదివారం విప్లవ సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. మారదులే.. ఈ దోపిడి దొంగల రాజ్యం మారదులే.. ఛలో ఛలో ఛలో అంటూ జనాలను ఉద్యమానికి ఉత్తేజితులను చేస్తూ విప్లవ శంఖం ఊదుతోందీ సాంగ్. దొరోని తలుపుకు తాళంలా, గడీల ముంగట కుక్కల్లా? ఎన్నాళ్లు? ఇంకెన్నాళ్లు? మన బతుకులు మారేదెన్నాళ్లు.. అన్న చరణాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. జీలుకర శ్రీనివాస్ రాసిన ఈ పాటను సురేశ్ బొబ్బిలి అద్భుతంగా పాడాడు.
Revolutions never go backward ✊🏾🔥#ChaloChalo - The Warrior Song from #VirataParvam out now
▶️ https://t.co/h8A7Pq3fIX
IN CINEMAS JUNE 17 🔥@Sai_Pallavi92 @venuudugulafilm #SureshBobbili @LahariMusic @SLVCinemasOffl @SureshProdns pic.twitter.com/T6m5fQw7WH— Rana Daggubati (@RanaDaggubati) June 12, 2022
చదవండి: ఒక లోతైన సముద్రంలోకి తోసేసిన ఫీలింగ్ కలిగింది: రానా