ఆర్జీవీ ఇంట విషాదం: కరోనాతో సోదరుడి మృతి

Ram Gopal Varma Cousin P Som Shekhar Passes Away Due To Covid - Sakshi

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు వరుసకు సోదరుడైన పి.సోమశేఖర్‌ కరోనాకు బలయ్యాడు. కొద్దిరోజులుగా కోవిడ్‌తో పోరాడుతున్న ఆయన హైదరాబాద్‌లో ఆదివారం తుది శ్వాస విడిచాడు. కాగా సోమశేఖర్‌ రంగీలా, దౌడ్‌, సత్య, జంగల్‌, కంపెనీ వంటి పలు చిత్రాల నిర్మాణ బాధ్యతలు చూసుకున్నాడు. అనురాగ్‌ కశ్యప్‌ రచయితగా పని చేసిన హిందీ సినిమా 'ముస్కురాకే దేఖ్‌ జర'కు దర్శకుడిగానూ పని చేశాడు. అతడి మరణంపై ఆర్జీవీ ఎమోషనల్‌ అయ్యాడు. "కొన్నేళ్లుగా అతడు మాతో లేడు. ఇతర వ్యాపారాల్లోకి వెళ్లడంతో చాలాకాలంగా మాకు దూరంగా ఉంటున్నాడు. నా జీవితంలో సోమశేఖర్‌ చాలా కీలకమైన వ్యక్తి. అతడిని చాలా మిస్‌ అవుతున్నాను" అని పేర్కొన్నాడు.

'తల్లి కోసం ఎంతో శ్రద్ధ తీసుకున్న శేఖర్‌, కరోనా సోకిన తర్వాత కూడా ఆమె కోసం పరితపించాడు. ఈ క్రమంలో అతడూ కరోనా బారిన పడ్డాడు. అయినప్పటికీ తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ ఆమెను కాపాడుకోగలిగాడు కానీ తను మాత్రం ప్రాణాలు కోల్పోయాడు' అని బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ విచారం వ్యక్తం చేశాడు.

సత్య చిత్రీకరణ సమయంలో వర్మ కంటే సోమశేఖర్‌కే ఎక్కువ భయపడేవాళ్లమన్న జేడీ చక్రవర్తి ఇద్దరి అభిరుచి ఒకటే కావడంతో చిన్న చిన్న తగాదాలు కూడా జరిగేవని తెలిపాడు. అయితే తొందరగానే అన్నింటినీ సర్దుకుపోయేవాళ్లమని గుర్తు చేసుకున్నాడు. ఈ మధ్య శేఖర్‌ ఒంటరివాడిగా మారిపోయాడని, కనీసం ఫోన్‌ కాల్స్‌ కూడా మాట్లాడకపోవడం ఆందోళనకు గురి చేసిందన్నాడు. ఇంతలోనే ఆయనను కరోనా కబళించడం విషాదకరమన్న జేడీ అతడు మన మధ్య లేనందుకు ఎక్కువగా బాధపడేది ఆర్జీవీనే అని తెలిపాడు.

చదవండి: నా చావుకు సుపారీ ఇచ్చాను, ఆ అవసరం రాదు: ఆర్జీవీ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

24-05-2021
May 24, 2021, 10:55 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ను రెండు డోసుల్లో... రెండు వేర్వేరు సంస్థలకు చెందిన టీకాలు అదించొచ్చా అనే అంశంపై కేంద్రం...
24-05-2021
May 24, 2021, 10:43 IST
సాక్షి, న్యూఢిల్లీ: శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే పీపీఈ కిట్లు ధరించి... కరోనా రోగులకు సేవలందిస్తున్న డాక్టర్లు, నర్సులను చూస్తున్నాం....
24-05-2021
May 24, 2021, 10:12 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19 వ్యాప్తితో ఒకవైపు జనం అల్లాడుతుంటే మరోవైపు శ్మశానాల్లో అంత్యక్రియలకు అధికంగా డబ్బులు వసూలు చేస్తుండడం పట్ల తీవ్ర...
24-05-2021
May 24, 2021, 09:59 IST
బంజారాహిల్స్‌: అసలే ఆదివారం.. ఉన్నది నాలుగు గంటల సమయం.. ఏమాత్రం ఆలస్యం చేసినా లాక్‌డౌన్‌ గడువు ముంచుకొస్తుంది. ఉన్న సమయంలోనే...
24-05-2021
May 24, 2021, 09:14 IST
ఐక్యరాజ్యసమితి: కోవిడ్‌–19 ముప్పు తొలగిపోలేదని, మహమ్మారి ఇంకా మనతోనే ఉందని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గ్యుటెరస్‌ హెచ్చరించారు. వైరస్‌...
24-05-2021
May 24, 2021, 08:55 IST
ఇంటికెళ్లగానే నా నాలుగేళ్ల కొడుకు, రెండున్నరేళ్ల పాప ఎదురుగా కనిపిస్తారు. భవిష్యత్తు గురించి చాలా భయంగా ఉంది.
24-05-2021
May 24, 2021, 08:42 IST
పేషెంట్‌ పరిస్థితి సీరియస్‌గా ఉంది.. చూడండి సార్‌
24-05-2021
May 24, 2021, 08:11 IST
న్యూయార్క్‌: భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని కరోనా బాధితులకు తమ వంతు సేవలందించేందుకు అమెరికాలోని వైద్యులు, వృత్తి నిపుణులు ముందుకొస్తున్నారు. వారంతా...
24-05-2021
May 24, 2021, 08:04 IST
తడి వాహనాన్ని ఆపిన పోలీసులు గుర్తింపు కార్డు అడిగారు. అప్పుడు కానీ అతగాడు అసలు విషయం చెప్పలేదు. పోలీసుల నుంచి...
24-05-2021
May 24, 2021, 05:08 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా బాధితులకు ఉచితంగా సేవలందించేందుకు కాంగ్రెస్‌ పార్టీ మూడు అంబులెన్సులను ఏర్పాటు చేసింది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి...
24-05-2021
May 24, 2021, 05:02 IST
పొన్నూరు: కరోనా నుంచి కోలుకున్న పేషెంట్లకు తీవ్ర ముప్పుగా పరిణమించిన బ్లాక్‌ ఫంగస్‌ను ఆయుర్వేద చికిత్సతో పూర్తిగా నివారించవచ్చని ఆయుర్వేద...
24-05-2021
May 24, 2021, 04:56 IST
సీబీఎస్‌ఈ క్లాస్‌ 12 పరీక్షల నిర్వహణపై జూన్‌ 1వ తేదీలోగా నిర్ణయం తీసుకుంటామని కేంద్రం వెల్లడించింది.
24-05-2021
May 24, 2021, 04:35 IST
కోవిడ్‌ బాధితులకు టీటీడీ అండగా నిలుస్తోంది. ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా అడుగులు వస్తోంది.
24-05-2021
May 24, 2021, 04:19 IST
సాక్షి, అమరావతి: కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోపాటు దైవ సంకల్పం తోడుగా ఉండాలని దేవదాయ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా...
24-05-2021
May 24, 2021, 04:17 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా బారిన పడిన వెంటిలేటర్‌పై ఉన్న ఓ గర్భిణీకి మాతృత్వాన్ని ప్రసాదించడంతో పాటు, నెలలు నిండకముందే పుట్టి...
24-05-2021
May 24, 2021, 03:53 IST
మందును ఎలా పంపిణీ చేయాలనే విషయమై ప్రభుత్వ సూచన, సహకారం మేరకు ఎమ్మెల్యే కాకాణి, ఇతర పెద్దలందరితో కలిసి ప్రణాళిక...
24-05-2021
May 24, 2021, 03:35 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలుత 45 ఏళ్లు నిండిన వారికి కోవిడ్‌ టీకాలు వేయడం పూర్తయ్యాకే 18 ఏళ్ల నుంచి...
24-05-2021
May 24, 2021, 03:34 IST
న్యూఢిల్లీ: ఫార్మా రంగ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ కోవిడ్‌–19 చికిత్సకు నూతన విధానాలను అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించింది. కొన్ని...
24-05-2021
May 24, 2021, 03:26 IST
కరోనా రాక ముందు.. వచ్చిన తర్వాత.. ఇంటి బడ్జెట్, వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికల విషయంలో ఎక్కువ మంది అంగీకరించే మాట...
24-05-2021
May 24, 2021, 02:20 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా సెకండ్‌వేవ్‌ తరుణంలో ఇటీవల కొత్తగా వినిపిస్తున్న పేరు వైట్‌ ఫంగస్‌. కొద్దిరోజులుగా బ్లాక్‌ ఫంగస్‌ చేస్తున్న...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top