రజనీ-కమల్‌ మూవీ క్రేజీ అప్‌డేట్‌ | Rajinikanth, Kamal Haasan Movie Crazy Update | Sakshi
Sakshi News home page

రజనీ-కమల్‌ మూవీ క్రేజీ అప్‌డేట్‌

May 5 2026 8:23 AM | Updated on May 5 2026 8:44 AM

Rajinikanth, Kamal Haasan Movie Crazy Update

జైలర్‌ 2 చిత్రాన్ని పూర్తి చేసిన నటుడు రజనీకాంత్‌ తదుపరి తన 173వ చిత్రానికి సిద్ధం అవుతున్నారు.దీన్ని నటుడు కమలహాసన్‌ తన రాజ్‌ కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మించనున్నారు. అయితే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కమలహాసన్‌,రజనీకాంత్‌ కలిసి నిర్మించే చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్‌ వస్తున్నాయి. ఆరంభ కాలంలో కలిసి పలు చిత్రాల్లో నటించిన కమల్‌,రజనీ సుమారు 17 ఏళ్ల తరువాత మళ్లీ కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి నెల్సన్‌ దర్శకత్వం వహించనున్నారు. రెడ్‌జయింట్స్‌ పతాకంపై ఇన్భున్‌ ఉదయనిధి ఈ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి రాజీవ్‌మీనన్‌ ఛాయాగ్రహణంను అందిస్తున్నారు. 

కాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమో ను ఇటీవల చిత్రీకరించారు. దీని గురించి ఆయన ఒక భేటీలో పేర్కొంటూ దర్శకుడు నెల్సన్‌ ఈ చిత్ర కథను వివరించిన విధం చాలా ఆసక్తిగా ఉందన్నారు. ముందుగా ఎలాంటి భావోద్రేకాల గురించి చెప్పకుండా వినోదంగా చెప్పే విధానం మనల్సి నవిస్తుందన్నారు. ఆయన ఒక్క వారంతోనే ఈ చిత్ర ప్రోమోను చిత్రీకరించాలని చెప్పారన్నారు. 

తాను ఇంతకు ముందు నటుడు కమలహాసన్‌తో వాణిజ్య ప్రకటనలను చేసిన అనుభవం ఉందనీ,అయితే రజనీకాంత్‌తో కలిసి పని చేయలేదని చెప్పారు. అలాంటిది వీరిద్దరితో కలిసి ప్రోమో ను చిత్రీకరించడం సరికొత్త అనుభవంగా పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం రజనీకాంత్‌,కమలహాసన్‌ వారి వారి చిత్రాలతో బిజీగా ఉన్నారనీ, దీంతో వారిద్దరూ కలిసి నటించే చిత్రం ఈ ఏడాది ఆగస్టులో గానీ, సెప్టెంబరులో గానీ ప్రారంభం అవుతుందని ఛాయాగ్రహకుడు రాజీవ్‌ మీనన్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement