విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ డ్రామా మూవీ ‘కింగ్డమ్’ (Kingdom). ఇందులో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటించగా సత్యదేవ్, వెంకటేశ్, అయ్యప్ప పి.శర్మ, రాజ్‌కుమార్ కసిరెడ్డి వంటి వారు నటించారు. నిర్మాత నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మించిన కింగ్డమ్ మూవీ ఈ ఏడాది జులైలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, సినిమాకు నెగటివ్ టాక్ రావడంతో భారీ నష్టాలు వచ్చాయని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలో తాజాగా కింగ్డమ్ కలెక్షన్స్‌పై నాగవంశీ రియాక్ట్ అయ్యారు.
'అందరూ కింగ్డమ్ సినిమా ఫెయిల్యూర్ అయిందని అంటున్నారు. అందులో నిజం లేదు. అమెరికాలోనే సుమారు రూ. 28 కోట్లు కలెక్ట్ చేసింది. కేవలం నైజాంలోనే రూ. 12 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇలాంటి సినిమాను ఫెయిల్యూర్ అంటే ఎలా..? కింగ్డమ్ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్, గౌతమ్ తిన్ననూరి వంటి వారు పనిచేయడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. దీంతో ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను మేము రీచ్ కాలేకపోయాం.
నా నుంచి కింగ్డమ్ సినిమాను కొన్న బయ్యర్లు అందరూ సేఫ్ జోన్‌లోనే ఉన్నారు. కలెక్షన్స్ పరంగా ఒకరో ఇద్దరో నష్టపోయిన బయ్యర్లకు జీఎస్టీ రూపంలో రిటర్న్ చేశాను. దీంతో వారు కూడా సేఫ్ జోన్‌లోకి వచ్చేశారు. ఈ సినిమాతో నాకు ఎలాంటి నష్టం జరగలేదు. అలాంటప్పుడు కింగ్డమ్ ప్లాప్ సినిమా ఎలా అవుతుంది..? కానీ, మేము అనుకున్నంత రేంజ్‌లో కింగ్డమ్ రన్ కాలేదు. బాక్సాఫీస్ లెక్కల పరంగా కింగ్డమ్ హిట్ చిత్రంగానే ఉంటుంది.' అని ఆయన అన్నారు.


