ప్రశాంత్‌ వర్మ సర్‌ప్రైజ్‌.. సూపర్‌ హీరో మూవీ పోస్టర్‌ రిలీజ్‌ | Prasanth Varma Cinematic Universe Adheera Movie With New Hero, Poster Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

కొత్త హీరోతో ప్రశాంత్‌ వర్మ సూపర్‌ హీరో మూవీ.. పోస్టర్‌ రిలీజ్‌

Sep 22 2025 12:16 PM | Updated on Sep 22 2025 12:44 PM

Prasanth Varma Cinematic Universe: Adheera Poster Released

హనుమాన్‌ సినిమాతో వెండితెరపై అద్భుతాన్ని సృష్టించాడు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma). ఈ ఒక్క మూవీతో అతడి పేరు మార్మోగిపోయింది. అంతేకాదు, తనదగ్గర 20 కథలు రెడీగా ఉన్నాయన్నాడు. వాటిని ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి ఒక్కొక్కటిగా రిలీజ్‌ చేస్తానన్నాడు. ఈ సినిమాలో సూపర్‌ హీరోలను చూస్తారన్నాడు.

పవర్‌ఫుల్‌ పోస్టర్‌
తాజాగా పీవీసీయూ (Prasanth Varma Cinematic Universe) నుంచి అధీర సినిమా పోస్టర్‌ వదిలారు. ఈ మూవీలో నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు దాసరి కల్యాణ్‌ హీరోగా నటిస్తున్నాడు. నటుడిగా ఇదే అతడి తొలి చిత్రం కావడం విశేషం. ఎస్‌జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. పోస్టర్‌లో అగ్నిపర్వతం బద్ధలైనట్లుగా చూపించారు. కల్యాణ్‌ సూపర్‌ హీరో గెటప్‌లో ఉన్నాడు.

థియేటర్లలో అధీర గ్లింప్స్‌?
ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు.. ఆశాకిరణం వెలుగులా పుట్టుకొస్తుందంటూ ప్రశాంత్‌ వర్మ అధీర పోస్టర్‌ షేర్‌ చేశాడు. అయితే ఈ మూవీకి దర్శకుడు ఈయన కాదు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా ఆర్‌కేడీ స్టూడియోస్‌ బ్యానర్‌పై రివాజ్‌ రమేశ్‌ దుగ్గల్‌ నిర్మిస్తున్నాడు. ప్రశాంత్‌ వర్మ సూపర్‌ విజన్‌తో ఈ మూవీ రాబోతోంది. దీనికి శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మించిన ఓజీ సెప్టెంబర్‌ 25న విడుదల కానుంది. పనిలో పనిగా అధీర గ్లింప్స్‌ను ఓజీలో చూపించాలని చిత్రయూనిట్‌ ప్లాన్‌ చేస్తోంది.

 

 

చదవండి: హౌస్‌లో తనే నెం.1, ఇచ్చిపడేసిండు.. ప్రియపై మనీష్‌ బిగ్‌బాంబ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement