ఈ పిల్లోడి నవ్వు భలే ఉంటుంది! | Sakshi
Sakshi News home page

ఈ పిల్లోడి నవ్వు భలే ఉంటుంది!

Published Sun, Mar 7 2021 8:16 AM

PC Sreeram Calls Naga Chaitanya Smile Mesmerising - Sakshi

‘‘పిల్లలందరితో లొకేషన్‌ చాలా సందడిగా ఉంది’’ అంటున్నారు ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్‌. ఒక సీనియర్‌ కెమెరామేన్‌గా లొకేషన్లో ఉన్నవాళ్లందరూ ఆయనకు పిల్లల్లా కనిపించారు. ఇక్కడున్న ఫొటోను బట్టి నాగచైతన్యతో చేస్తున్న సినిమా గురించే పీసీ శ్రీరామ్‌ ఇలా అని ఉంటారని అర్థమై ఉంటుంది.

నాగచైతన్య హీరోగా విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘థ్యాంక్యూ’. ఈ చిత్రం షూటింగ్‌ రాజమండ్రిలో జరుగుతోంది. చిత్రీకరణకు సంబంధించిన ఓ చిన్న వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి, ‘‘ఈ పిల్లోడి నవ్వు భలే ఉంటుంది’’ అని నాగచైతన్యను ఉద్దేశించి అన్నారు పీసీ శ్రీరామ్‌. ఫొటోలో నాగచైతన్య మీసాలు లేకుండా యంగ్‌ లుక్‌లో కనబడుతున్నారు. ఇందులో చైతూ స్కూల్‌ స్టూడెంట్‌లానూ కనబడతారని ఓ వార్త వచ్చింది. ఆ వార్త నిజమేనని ఈ ఫొటో చెబుతోంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement