‘వకీల్‌ సాబ్‌’ ఫస్ట్‌ రివ్యూ.. పవర్‌ స్టార్‌ ఈజ్‌ బ్యాక్‌

Pawan Kalyan Vakil Saab Movie First Review, Blockbuster Hit By Film Critic Umair Sandhu - Sakshi

పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ రీఎంట్రీ మూవీ ‘వకీల్‌ సాబ్‌’ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో పవన్‌ కల్యాణ్‌ అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. సినిమా ఎలా ఉంటుందో అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా విడుదలకు ముందే పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు శుభవార్త వచ్చేసింది.

దుబాయ్‌లో ఉంటూ టాలీవుడ్ సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఇచ్చే సినీ విమర్శకుడు, ఓవర్ సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు గురించి చాలా మందికి తెలుసు. ఇప్పటికే ఆయన చాలా తెలుగు సినిమాలకు ఫస్ట్ రివ్యూలు ఇచ్చారు. ఇప్పుడు ‘వకీల్‌ సాబ్‌’కి కూడా రివ్యూ ఇచ్చేశాడు. పవన్‌ కల్యాణ్‌ ఈజ్ బ్యాక్ అని.. బిగ్గెస్ట్ హిట్ అందుకోబోతున్నారంటూ రివ్యూలో చెప్పుకొచ్చాడు.

మోస్ట్ కాంట్రవర్సియల్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ క్రిటిక్‌గా తనని తాను ప్రకటించుకున్న ఉమర్.. విడుదలకు ముందే సినిమా చూశానంటూ.. తాను ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్‌ని అని రివ్యూలు ఇస్తూ ఫేమస్‌ అయ్యాడు. ఇటీవల ఇతని తన ట్వీటర్‌ అకౌంట్  హ్యాకింగ్‌కి గురికావడంతో మళ్లీ కొత్త అకౌంట్‌తో రివ్యూలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ‘వకీల్ సాబ్ సెన్సార్ రిపోర్ట్ సాలిడ్ అండ్ టెర్రఫిక్. సింగిల్ కట్ లేకుండా సెన్సార్ కంప్లీట్ చేసుకుందని.. ఔట్ స్టాడింగ్ రెస్పాన్స్ వచ్చిందని పేర్కొన్నాడు. గతంలో కూడా పవన్‌ సినిమాలు కాటమరాయుడు, అజ్ఞాతవాసి చిత్రాలు కూడా సూపర్‌ హిట్‌ అంటూ రివ్యూలు ఇచ్చాడు. కానీ అవి ఫ్లాప్‌ని మూటగట్టుకున్నాయి. మరి ‘వకీల్‌ సాబ్‌’కి ఇచ్చిన రివ్యూ  ఏ మేరకు వాస్తవమో తెలియాలంటే ఏప్రిల్‌ 9 వరకు ఆగాల్సిందే. 

వకీల్‌ సాబ్‌ విషయానికి వస్తే.. బాలీవుడ్‌ సినిమా ‘పింక్‌’కి రీమేక్‌ ఇది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, బోని కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

 

చదవండి: 
వకీల్‌ సాబ్‌’‌ నుంచి మరో సాంగ్‌ విడుదల 
డైరెక్టర్‌ మృతి, హాస్పిటల్‌ బిల్‌ కట్టిన విజయ్‌ సేతుపతి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top