‘భవదీయుడు భగత్‌సింగ్‌’ పేరు మారింది.. కొత్త టైటిల్‌ ఇదే | Sakshi
Sakshi News home page

Pawan Kalyan: ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ పేరు మారింది.. కొత్త టైటిల్‌ ఇదే

Published Sun, Dec 11 2022 9:44 AM

Pawan Kalyan Harish Shankar New Movie Titled As Ustad Bhagat Singh - Sakshi

పవన్‌ కల్యాణ్‌ హీరోగా హరీశ్‌ శంకర్‌ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి‘భవదీయుడు భగత్‌సింగ్‌’ అనే టైటిల్‌ని ఖరారు చేస్తూ పోస్టర్‌ కూడా విడుదల చేశారు. కానీ ఈ మూవీ ఇప్పటివరకు సెట్స్‌పైకి పోలేదు. దీంతో ఈ సినిమా ఉంటుందో లేదో అనే చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో  చిత్రబృందం ఓ బిగ్‌ అప్‌డేట్‌ని వదిలింది.

సినిమా టైటిల్‌ని మార్పు చేస్తూ..'భవదీయుడు భగత్ సింగ్' బదులుగా 'ఉస్తాద్ భగత్ సింగ్' అంటూ కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అనే ట్యాగ్‌ లైన్‌తో పాటు ఈ సారి కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రమే కాదు’ అనే థీమ్‌లైన్‌ కూడా ఇచ్చారు. త్వరలోనే  షూటింగ్‌ ప్రారంభం అవుతుందని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటించింది.  గబ్బర్ సింగ్ తర్వాత పవన్‌ కల్యాణ్‌- హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ రెండో చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. 

Advertisement
 
Advertisement
 
Advertisement