Nithin Krithi Shetty: 'మాచర్ల నియోజకవర్గం' నుంచి నితిన్, కృతిశెట్టి కొత్త లుక్..

Nithin Krithi Shetty New Look From Macherla Niyojakavargam: నితిన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతీ శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా చివరి పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ నితిన్, కృతీశెట్టి లుక్ విడుదల చేసింది.
దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. పొలిటికల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. మిగిలిన ఒక పాటను త్వరలో చిత్రీకరించనున్నాం. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్ట్ 12న సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల.
చదవండి: నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్‌ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ?
వెనక్కి తగ్గిన నాగ చైతన్య.. 'థ్యాంక్యూ' రిలీజ్‌లో మార్పు
Except for one song, the entire talkie part of @actor_nithiin's #MacherlaNiyojakavargam has been completed ✅🔥
Ready to take charge on Theatres from August 12th! ⚠️💥#MNVFromAug12th ✨@IamKrithiShetty @CatherineTresa1 @SrSekkhar #MahathiSwaraSagar @SreshthMovies @adityamusic pic.twitter.com/WyIlhS1d9E
— Sreshth Movies (@SreshthMovies) June 24, 2022