‘నా సౌర వ్యవస్థ మీరే.. నాకన్నీ మీరే’

Netizen Variety Proposal to Actor Madhavan - Sakshi

ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14వ తేదీ ఉంటే దానికన్నా ముందే వారం రోజుల పాటు వివిధ రకాల సంబరాలు జరుగుతుంటాయి. చాక్లెట్‌ డే, ప్రపోజ్‌ డే తదితర రోజులు ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రపోజ్‌ డే వచ్చింది. ఈ ప్రపోజల్‌ డే నాడు హీరోకు ఓ అభిమాని వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పింది. అతడిని ఎంత ప్రేమిస్తుందో సౌర వ్యవస్థను ఉదాహరణగా చేసుకుని చెప్పింది. నా సౌర వ్యవస్థ మీరే.. నాకన్నీ మీరే అని సోషల్‌ మీడియాలో ప్రపోజ్‌ చేసింది.

తెలుగు, తమిళ్‌, మళయాలం, హిందీతో పాటు మొత్తం ఏడు భాషల్లో నటించిన వ్యక్తి మాధవన్‌. ఆయనకు తమిళనాడులో వీరాభిమనులు ఉన్నారు. ఆయన సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనలతో అందరికీ సుపరుచితులు. అయితే బుధవారం ప్రపోజ్ డే సందర్భంగా మాధవన్‏కు ఓ అభిమాని లవ్ ప్రపోజల్‌ వినూత్నంగా చేసింది.

‘ప్రపంచంలో 8 గ్రహాలు, 204 దేశాలు, 7 సముద్రాలు, 7,707 ద్వీపాలు, 7.8 బిలియన్ ప్రజలు ఉన్నారు. నేను మరణించేవరకు మిమ్మల్ని ప్రేమిస్తా. దయచేసి నా ప్రేమను అంగీకరించండి. మీరే నా జీవితం. నా ప్రపంచం. నా సౌర వ్యవస్థ. నాకు అన్ని మీరే’ అంటూ ఓ యువతి మాధవన్‌కు ప్రపోజ్‌ చేసింది. తన ప్రేమనంతా కలిపి వినూత్నంగా ప్రపోజ్‌ చేయడం నెటిజన్లను ఆకట్టుకుంది. ఆమె ప్రపోజల్‌కు మాధవన్ స్పందిస్తూ.. ‘నిన్ను ఆ దేవుడు చల్లగా చూడాలి. మీ ప్రేమకు నా కృతజ్ఞతలు’ అని బదులిచ్చారు. మాధవన్‌ ఇటీవల కాలంలో నాగచైతన్యతో ‘సవ్యసాచి’, అనుష్కతో కలిసి ‘నిశ్శబ్దం’ సినిమా చేసిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం మాధవన్‌ ‘రాకెట్రీ ది నంబీ ఎఫెక్ట్’ అనే సినిమా తీస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top