
Naga Chaitanya Reaction On Trolls About His Divorce With Samantha: టాలీవుడ్ మోస్ట్ క్యూటెస్ట్ కపుల్ సమంత- నాగచైతన్య విడాకుల వ్యవహారం ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే ఉంది. రీసెంట్‌గా విడాకులపై స్పందించిన నాగ చైతన్య.. ఇద్దరి మంచి కోసం ఈ డెసిషన్ తీసుకున్నామని, దీనివల్ల ఇద్దరం సంతోషం ఉన్నామని పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా చై మరోసారి విడాకులపై స్పందించాడు.
బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య మాట్లాడుతూ.. నా గురించి ఏం రాసినా పర్వాలేదు. కానీ నా కుటుంబం రాస్తే నేను బాధపడతాను. నాన్న (నాగార్జున)చెప్పినట్లు..కుటుంబంలో కానీ, వ్యక్తిగత విషయాల్లో కానీ ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకోవాలి.
లేకపోతే పర్వాలేదు(దట్స్ ఓకే).. కానీ నా కుటుంబం గురించి ఇష్టం వచ్చినట్లు రాయడం నన్ను బాధించింది. అయినా పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అనే విషయాన్ని నేను బలంగా నమ్ముతాను. అందుకే విషయాన్ని మిస్ లీడ్ చేయనంత వరకు నేను స్పందించను అంటూ చెప్పుకొచ్చాడు చై.