Amitabh Bachchan - Anushka Sharma: అమితాబ్‌, అనుష్క అయితే ఏంటి?.. రూల్స్ పాటించాల్సిందే!

Mumbai Police Action On Amitabh Bachchan and Anushka Sharma Bike Riding without helmets  - Sakshi

బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్, అనుష్క శర్మ బైక్‌ రైడ్‌పై ముంబయి పోలీసులు స్పందించారు. అమితాబ్ షూటింగ్‌ స్పాట్‌కు వెళ్లేందుకు బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని లిఫ్ట్‌ అడిగి వెళ్లారు. అయితే బైక్‌పై ఇద్దరు ఎలాంటి హెల్మెట్‌ లేకుండా కనిపించారు. బైక్‌పై కూర్చొని ఉన్న చిత్రాన్ని బిగ్‌ బీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఇది చూసిన నెటిజన్స్ ముంబయి పోలీసులకు ట్యాగ్ చేశారు. దీనిపై ముంబయి పోలీసులు సైతం స్పందించారు. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

(ఇది చదవండి: పెళ్లై 14 ఏళ్లు.. పిల్లలు లేకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్న నటి)

మరోవైపు బాలీవుడ్ నటి అనుష్క శర్మ సైతం ఎలాంటి హెల్మెట్ లేకుండా బైక్‌పై కనిపించారు. తన బాడీగార్డ్‌తో బైక్ రైడ్ చేస్తూ కనిపించింది. వాళ్లద్దరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో నెటిజన్స్ వెంటనే ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అమితాబ్ బచ్చన్, అనుష్క శర్మలపై ముంబయి పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. ఎంత పెద్దవారైనా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందేనని పోలీసులు సూచిస్తున్నారు. 

కాగా.. అమితాబ్ బచ్చన్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్‌ కెలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటాని కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 2024లో విడుదల కానుంది. ఇదే కాకుండా బిగ్ బి రిభు దాస్‌గుప్తా మూవీ కోర్ట్‌ రూమ్ డ్రామా సెక్షన్ 84లో కనిపించనున్నారు. ఆ తర్వాత అతను టైగర్ ష్రాఫ్, కృతి సనన్ చిత్రం గణపత్‌లో కూడా నటించనున్నారు.

(ఇది చదవండి: లైకా ప్రొడక్షన్స్‌పై ఈడీ దాడులు.. దాదాపు ఎనిమిది చోట్ల ఒకేసారి!)

మరోవైపు.. అనుష్క చివరిసారిగా షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్‌లతో కలిసి జీరోలో కనిపించింది. ఈ ఏడాది ఆమె చక్దా 'ఎక్స్‌ప్రెస్‌తో తిరిగి సినిమాల్లోకి రానుంది. తన కూతురు వామిక పుట్టిన తర్వాత ఆమెకు ఇది మొదటి సినిమా కావడం విశేషం. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top