Mahesh Babu About Pushpa: Mahesh Babu Review On Pushpa Movie, Calls It Sensational - Sakshi
Sakshi News home page

Mahesh Babu: పుష్ప సినిమాపై సూపర్‌ స్టార్‌ రివ్యూ

Jan 5 2022 8:30 AM | Updated on Jan 5 2022 9:36 AM

Mahesh Babu Review On Pushpa Movie, Calls It Sensational - Sakshi

పుష్పగా అల్లు అర్జున్‌ నటన స్టన్నింగ్‌, ఒరిజినల్‌, సెన్సేషనల్‌గా ఉంది. దేవి శ్రీ ప్రసాద్‌.. నీ గురించి ఏం చెప్పను?. నువ్వో రాక్‌స్టార్‌వి...

Mahesh Babu About Pushpa: ఐకానిక్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషనల్‌లో వచ్చిన క్రేజీ చిత్రం 'పుష్ప: ది రైజ్‌'. డిసెంబర్‌ 17న థియేటర్లలో రిలీజైన ఈ పాన్‌ ఇండియా సినిమా అంచనాలకు మించి వసూళ్లు సాధిస్తోంది. మరీ ముఖ్యంగా హిందీలో ఊహించని విధంగా కలెక్షన్లు రాబడుతోంది. పుష్ప రిలీజై 20 రోజులు కావస్తున్నా ఈ కలెక్షన్ల వర్షం ఆగడం లేదు. పుష్పరాజ్‌గా బన్నీ, శ్రీవల్లిగా రష్మిక ఇద్దరూ పోటీపడి నటించారు.

తాజాగా ఈ సినిమాపై సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు ట్విటర్‌ వేదికగా రివ్యూ ఇచ్చాడు. 'పుష్పగా అల్లు అర్జున్‌ నటన స్టన్నింగ్‌, ఒరిజినల్‌, సెన్సేషనల్‌గా ఉంది. అత్యద్భుతంగా నటించాడు. తన సినిమాలు ఎంత వాస్తవంగా, పచ్చిగా, నిజాయితీగా ఉంటాయో సుకుమార్‌ మరోసారి నిరూపించాడు' అని చెప్పుకొచ్చాడు. అలాగే 'పుష్ప'కు పని చేసిన టెక్నీషియన్ల గురించి మరో ట్వీట్‌ చేశాడు.

'దేవి శ్రీ ప్రసాద్‌.. నీ గురించి ఏం చెప్పను?. నువ్వో రాక్‌స్టార్‌వి. మైత్రీ మూవీ మేకర్స్‌ టీమ్‌కు శుభాకాంక్షలు. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది' అని పేర్కొన్నాడు. కాగా మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన పుష్ప చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా మలయాళ స్టార్‌ ఫహద్‌ ఫాజిల్‌ విలన్‌గా, అనసూయ, సునీల్‌ నెగెటివ్‌ రోల్స్‌లో కనిపించారు. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement