Mahesh Babu And Namrata Special Birthday Wishes To Daughter Sitara, Goes Viral - Sakshi
Sakshi News home page

Sitara Birthday: తెలియకుండానే పదేళ్లు గడిచాయి.. గారాలపట్టికి మహేశ్‌ బర్త్‌డే విషెస్‌

Jul 20 2022 11:37 AM | Updated on Jul 20 2022 1:16 PM

Mahesh babu, Namrata Wishes Their Daughter Sitara On Her Birthday - Sakshi

తెలియకుండానే పదేళ్లు గడిచాయి. నా ప్రపంచంలో వెలుగు నింపిన నక్షత్రం నువ్వు

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబుకే కాదు.. ఆయన ముద్దుల కూతురు సితారకు కూడా భారీ ఫ్యాన్‌ ఫాలో​యింగ్‌ ఉంది. సోషల్‌ మీడియాలో ఆమె పెట్టే డ్యాన్స్‌ వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. నేడు(జులై 20) సీతు పాప పుట్టిన రోజు. ఈ సందర్భంగా మహేశ్‌ బాబు తన గారాల పట్టి సితారకు సోషల్‌ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్‌ తెలియజేశాడు. ‘తెలియకుండానే పదేళ్లు గడిచాయి. నా ప్రపంచంలో వెలుగు నింపిన నక్షత్రం నువ్వు. హ్యాపీ బర్త్‌డే సితార..నిన్ను పదిరెట్లు ఎక్కువగా ప్రేమిస్తున్నాను’అని మహేశ్‌ ట్వీట్‌ చేశాడు. 
 

మరోవైపు నమత్ర కూడా సోషల్‌ మీడియా వేదికగా సీతారకు పుట్టిన రోజు శుభాక్షాంక్షలు తెలిపారు. ‘హ్యాపీబర్త్‌డే మై లిటిల్‌ వన్‌. నీ చిన్ని కుయుక్తులు, అల్లరి చేష్టలు, బోరింగ్‌ బెడ్‌ స్టోరీస్‌..అన్నింటిని ప్రేమిస్తున్నాను. ఇవి వచ్చే ఏడాది కూడా కొనసాగుతాయని ఆశిస్తున్నాను. కొత్త దశలోకి అడుగుపెడుతున్న నీకు నా ప్రేమ, కౌగిలింతలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఇంకా నువ్వు కనుగొనవలసినవి, నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నీ మనసులో అనుకున్న ఏ లక్ష్యాన్ని అయినా కచ్చితంగా సాధించగలవని అనుకుంటున్నాను. లవ్‌ యూ పప్లూ’  అని నమ్రత ఇన్‌స్టాలో రాసుకొస్తూ.. ఓ స్పెషల్‌ వీడియోని షేర్‌ చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement