M4M: కిల్లర్‌ ఎవరో చెబితే లక్ష రూపాయల నగదు బహుమతి | M4M Movie Pre Release Event Highlights | Sakshi
Sakshi News home page

M4M: కిల్లర్‌ ఎవరో చెబితే లక్ష రూపాయల నగదు బహుమతి

May 5 2026 8:55 AM | Updated on May 5 2026 9:07 AM

M4M Movie Pre Release Event Highlights

జో శర్మ, సంబీత్‌ ఆచార్య ప్రధాన తారాగణంగా మోహన్‌ వడ్లపట్ల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ఎమ్‌ 4 ఎమ్‌’ (మోటివ్‌ ఫర్‌ మర్డర్‌). పీవీఆర్‌ ఐనాక్స్‌ పిక్చర్స్‌ ద్వారా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఈ నెల 8న రిలీజ్‌ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్‌  ఆదిత్య, దర్శకుడు వి. సముద్ర హాజరై, సినిమా హిట్టవ్వాలని కోరారు. 

‘‘మా చిత్రానికి ఇప్పటికే 25 దేశాల్లో 50కిపైగా అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి’’ అన్నారు జో శర్మ. ‘‘ఈ మూవీలోని సీరియల్‌ కిల్లర్‌ ఎవరో ముందుగా చెప్పిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతి ఉంటుంది’’ అన్నారు మోహన్‌ వడ్లపట్ల.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement